కనక వర్ణపు పూలతో గురుగ్రహాన్ని అర్చిస్తే ఈరాశివారికి విజయం! మార్చి 7 రాశి ఫలాలు

-

కనక వర్ణపు పూలతో గురుగ్రహాన్ని అర్చిస్తే ఈరాశివారికి విజయం!

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, కార్యనష్టం, కళత్రవర్గంతో ఇబ్బందులు, అధికశ్రమ.
పరిహారాలు: విష్ణుపారాయణం లేదా చాలీసా పారాయణం చేయండి.

వృషభరాశి: ప్రతికూల ఫలితాలు. కార్యనష్టం, ఊహించని సంఘటనలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: కనకవర్ణం అంటే పచ్చని పసుపు రంగు పూలతో, ద్రవ్యాలతో గురుగ్రహాన్ని పూజించండి లేదా ప్రదక్షణలు చేసి బెల్లం నైవేద్యం పెట్టండి మంచి జరుగుతుంది.

మిథునరాశి: మిశ్రమం. అకారణ విరోధాలు, అలసట, పనుల్లో జాప్యం. బంధువుల రాక.
పరిహారాలు: దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం/శ్రవణం లేదా గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, వస్తునష్టం, ధననష్టం.
పరిహారాలు: నవగ్రహ ప్రదక్షణలు, విష్ణు సహస్రనామ పారాయణం.

సింహరాశి: ప్రతికూలం. చికాకులు, అలసట, అవాంతరాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: గురు, శని గ్రహాలకు ప్రదక్షణలు, బెల్లం, నువ్వులు కలిపి నైవేద్యం పెట్టండి మంచి ఫలితం వస్తుంది.

కన్యారాశి: అనుకూలం. ప్రయాణ సూచన, పనుల్లో కొంత వేగం, భార్యతో ప్రయాణం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి బయటకు వెళ్లండి మంచి ఫలితం వస్తుంది.

తులారాశి: అనుకూల వాతావరణం. విందులు, వినోదాలు, దేవాలయ దర్శన సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి మంచిది.

వృశ్చికరాశి: ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం. దుర్‌వార్తా శ్రవణం, కార్యనష్టం.
పరిహారాలు: నవగ్రహ పూజ/ ప్రదక్షణలు, దగ్గర్లోని దేవాలయ ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి: ప్రతికూలం. అనారోగ్యం, మనఃశాంతి ఉండదు, దుఃఖం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, పచ్చని పూలతో గురు ఆరాధన, నల్లని పూలతో శని ఆరాధన చేయండి విఘ్నాలు తొలుగుతాయి.

మకరరాశి: ప్రతికూలం. అవమానం, ఇబ్బందులు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: నవగ్రహస్తోత్ర పారాయణం, ఏదైనా దేవాలయాన్ని దర్శించి ప్రదక్షణలు చేయండి. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి: మిశ్రమం. అలసట, అనారోగ్యం, వస్తులాభం. పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి దీపారాధన లేదా స్తోత్రపారాయణం చేయండి లేదా గోవింద నామాలను మనస్సులో పఠించుకోండి మంచి జరుగుతుంది.

మీనరాశి: అనుకూలం. పనులు పూర్తి, అలసట, ప్రయాణ లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి మంచి జరుగుతుంది.

నోట్- దానాలు, ధర్మాలు, గోసేవ వంటివి మీ శక్తిమేర చేయండి. రూపాయి నుంచి మీ శక్తిమేరకు ఏదైనా మనఃపూర్వకంగా చేస్తే చాలు ఈశ్వర అనుగ్రహం ఉంటుంది.

అర్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి ఆ విగ్రహం లేకుంటే గణపతి ఫొటో (దేవున్ని) భక్తితో నమస్కరించి పనులు ప్రారంభించుకోండి. చాలు తప్పక మీకు మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version