ప్రకాశం , నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రకాశం జిల్లా ఒంగోలు,పామూరు, కనిగిరి, గుడ్లూరు, పెదచెర్లోపల్లె, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కొండాపి, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరు. నెల్లూరు జిల్లావరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, కలిగిరి, దగదర్తి, బోగోల్, జలదంకి,
హనుమసముద్రంపేట, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కావలి. కడప జిల్లా శ్రీఅవదూతకాశినయన, కలసపాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి. మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండనీ… సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కాసేపటి క్రితం ప్రకటించారు.