డిసెంబర్‌ 16 బుదవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 16 – బుదవారం – మార్గశిరమాసం.

 

మేష రాశి:ఈరోజు అనుకూలంగా ఉంది!

ధన వృద్ధి కలుగుతుంది. కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రేమికుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు అందరికీ అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్యాష్టక పారాయణాన్ని చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:సోదరులతోకలిసిమెలిసి ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లేనిపోని అపవాదులు వచ్చే సూచనలు ఉన్నాయి, దూరంగా ఉండండి. వాహనాలను జాగ్రత్తగా నడపండి. స్త్రీలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితో తొందరపడి మాట్లాడకండి. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దంపతుల మధ్య అవగాహన కలిగి ఉండండి. సోదరులతోకలిసిమెలిసి ఉండండి, విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపండి. దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శించండి. ఎదుటివారితో జాగ్రత్తగా మసలుకో డి. పరిహారాలుః సంకష్ట గణపతి పారాయణాన్ని చేసుకోండి.

 

 మిధున రాశి:గృహోపకరణ వస్తువులు కొనుగోలు !

ఈరోజు అన్ని పనులకు అనుకూలమైన రోజు. ధనాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. మీ దగ్గర ఆత్మీయులను కలుసుకుంటారు. మిమ్మల్ని అందరూ  ఆదరిస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు, పోటీపరీక్షల్లో బాగా రాణిస్తారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు, పెద్ద వారి సూచనలను పాటిస్తారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః ఈరోజు లలితా సహస్రనామ పారాయణ అన్ని చేసుకోండి.

 

 కర్కాటక రాశి:ఈరోజు మహారాజ యోగం !

ఈరోజు ఆనందకరంగా ఉంటారు. ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. మంచి మాటలతో అందరికీ దగ్గరవుతారు. ఈరోజు మీ గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని చేస్తారు. ఈరోజు ధైర్యంగా ఉంటారు. బంగారు ఆభరణాలను, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత గా ఉంటారు. మీరు చేసే పనిలో అభివృద్ధిని, ఆనందాన్ని పొందుతారు. ధనలాభం పొందుతారు. ఈరోజు మహారాజ యోగం కలుగుతుంది.

 పరిహారాలుః ఈరోజు శివ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:పిల్లల విషయంలో జాగ్రత్తగా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ సభ్యులతో సఖ్యాతగా ఉండండి. ఈరోజు పనులను చాలా నెమ్మదిగా పూర్తిచేస్తారు. ఈరోజు కొత్త స్నేహితులతో పరిచయాలు చేసుకోకండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించండి.  ఉద్యోగస్తులకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరంగా ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ దగ్గరి బంధువులను సన్నిహితులను దూరం చేసుకోకండి.

పరిహారాలుః చంద్రునికి జపం చేయించుకోండి, శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 కన్యారాశి:ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు మీరు తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి ఈరోజు ఎవరితో అయినా తక్కువగా మాట్లాడండి. ఎవరికీ డబ్బులు ఇవ్వడం చేయకండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. అయిన వారిని దూరం చేసుకోకండి. చెప్పుడు మాటలను వినకండి. దంపతులిద్దరూ మంచి అవగాహన కలిగి ఉండండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి.

పరిహారాలుః  బుధగ్రహ అష్టోత్తర శతనామావళి చదువుకోండి. గురుదత్త చరిత్రను చదువండి.

 

 తులారాశి:మీ మాటలతో అందరిని ఆకర్షిస్తారు !

ఈరోజు మంచి సౌఖ్యంగా ఉంటారు. మంచి ఆనందంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఇంతకుముందు ఉన్న అపవాదు నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. మీరు ప్రతి చోట మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. గృహానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు ఈ రోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈరోజు వాహన యోగం కలుగుతుంది. మీ మాటలతో అందరిని ఆకర్షిస్తారు. విద్యార్థులు ఈ రోజు విద్య మీద శ్రద్ధ చూపుతారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ అన్ని చేసుకోండి.

 

 వృశ్చికరాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలను వినకండి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీకు అయిన వారు సహాయం చేస్తారు. దుష్టులకు దూరంగా ఉండండి. ఎవరిని అతిగా నమ్మకండి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఈరోజు కొంచెం మానసిక వేదన పడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొంచెం తక్కువ గా మాట్లాడండి. ధ్యానం చేసుకోండి.

పరిహారాలుః ఎవరికైనా గొడుగు, చెప్పులను దానం చేయండి. మంచి సఖ్యతగా ఉంటారు. అదేవిధంగా శని అష్టోత్తర చదవండి.

 

 ధనస్సురాశి:సోదరులతో సఖ్యతగా ఉంటారు !

ఈరోజు మంచి ఆనందంగా సంతోషంగా గడుపుతారు. మంచి సౌఖ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం వల్ల పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. స్నేహితుల వల్ల ధనలాభం, ఉద్యోగలాభం పొందుతారు. అయిన వారి నుంచి ఆదరణ పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. అన్ని వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. భార్య భర్తలు మంచి సఖ్యతగా ఉంటారు. ఈరోజు దైవకార్యంలో పాలుపంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మకరరాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు మిత్ర లాభం కలుగుతుంది. ధన లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు ప్రయాణ లాభం కలుగుతుంది. ఈ రోజు అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయట పడతారు. ధన లాభం పొందుతారు. సమాజ గౌరవాన్ని పొందుతారు. దంపతుల మధ్య మంచి అవగాహన కలిగి ఉండాలి. భగవత్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ రోజు అన్ని రకాలుగా బాగుంటుంది.

పరిహారాలుః ఈ రోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేయండి.

 

 కుంభరాశి:పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు అన్ని పనులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసిస్తారు.  పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. దంపతుల మధ్య మంచి అవగాహన కలిగి ఉంటారు. మీరు పోగొట్టుకున్న ధనాన్ని పొందుతారు. ఈరోజు ప్రయాణ లాభం కలుగుతుంది. ఈ రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా విలాసంగా ఉంటారు.

పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

 మీనరాశి:ఈరోజు ప్రయాణ లాభం కలుగుతుంది !

ఈరోజు మంచి ఆనందంగా, సౌఖ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ప్రయాణ లాభం కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు ఆర్థిక లాభం కలుగుతుంది. మీరు పోగొట్టుకున్న వస్తువులను మళ్ళీ మీరు పొందుతారు. అన్నిరకాల ఇబ్బందుల నుంచి బయట పడతారు. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు.

పరిహారాలుః ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version