జనవరి 18 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

పుష్యమాసం- జనవరి – 18- సోమవారం.

మేష రాశి: ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగిపోతాయి. అనవసరపు ఖర్చులను పెంచుకొని ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు విషయాలు మాట్లాడకుండా ఉండటం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు. పెద్దవారిని గౌరవించడం మంచిది, వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. పరీక్షలు జాగ్రత్తగా రాయడం మంచిది.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు అనారోగ్యాలు తొలగిపోతాయి !

ఈరోజు బాగుంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకొని ధనాభివృద్ధి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.  వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పర్మినెంట్ అవకాశాలను పొందుతారు. రాబోయే రోజుల కోసం బాగా ప్రణాళిక వేసుకుంటారు. ఇంతకుముందు ఉన్న వివాదాస్పద విషయాలు ఈరోజు తొలగిపోతాయి.

పరిహారాలుః శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ఈరోజు దంపతులు అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఆస్తి పంపకాలు కలసి వస్తాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకొని కార్యసిద్ధి పొందుతారు. ప్రైవేట్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. సోదర సోదరీమణులతో కలిసిమెలిసి ఉంటారు. బాగా మాట్లాడడం వల్ల అన్ని పనుల్లో అనుకూలత పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలను పొందుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు వ్యాపారంలో అధిక లాభాలు !

ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. శత్రువులు కూడా మీకు తలవంచే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. పెద్దవారిని గౌరవిస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. విద్యార్థులు బాగా చదువుకొని సంపూర్ణ విద్యాభివృద్ధిని పొందుతారు.

పరిహారాలుః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు ఉద్యోగస్తులకు సమస్యలు !

ఈరోజు ఇబందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో తప్పు పనులు చేయకుండా ఉండడం మంచిది. చెడ్డవారితో స్నేహం చేయకుండా ఉండటం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తక్కువగా మాట్లాడటం మంచిది. గర్వం లేకుండా నిరాడంబరంగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి, బీదవారికి అన్నదానం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

కన్యారాశి: ఈరోజు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !

ఈరోజు శుభకరంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. రావలసిన మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన ప్రాప్తి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వివాహ నిశ్చయ తాంబూలాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీ వెంకటేశ్వర గోవింద నామస్మరణ పారాయణం చేసుకోండి.

 

 తులారాశి: ఈరోజు వ్యాపారంలో లాభాలు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేమవివాహాలు జరిగిపోతాయి. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. మీ మాటలతో అందరిని అన్ని విషయాల్లో నమ్మకం కలిగిస్తారు. సోదరులతో కలసి మెలసి ఉంటారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. గొప్ప వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని జీవితంలో మార్పులు పొందుతారు.

పరిహారాలుః గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: పోగొట్టుకున్న వస్తువులను పొందుతారు !

ఈరోజు సామాన్య కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే పోటీ పరీక్షలో రాణిస్తారు. పెద్ద వారి మాటలు వినడం ద్వారా పనులు అనుకూలంగా సాగుతాయి. మీ సొంతంగా మీరు తప్పులు తెలుసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా స్వల్ప లాభాలను పొందుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. భార్య తరపు నుంచి శుభ యోగాలు కలుగుతాయి. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: వాహన ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  వ్యసనాలకు దూరంగా ఉండండి. తొందరగా ఎవర్ని నమ్మకుండా ఉండడం మంచిది. మీ మిత్రులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. తల్లిదండ్రులకు సేవ చేయడం మంచిది. ఈరోజంతా తక్కువగా మాట్లాడడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మకర రాశి: పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ఆఫీసులో పదోన్నతి పొందుతారు. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, డబ్బును తిరిగి పొందుతారు. ధనలాభం కలుగుతుంది. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కుంభరాశి: ఆరోగ్యం జాగ్రత్త !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ విషయంలో తొందర పడకుండా ఉండటం మంచిది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే లేనిపోని గొడవలకు దారితీస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త, చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరపు సంభాషణలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవడం మంచిది.

పరిహారాలుః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి గోధుమలు, పెసర్లు బ్రాహ్మణుడికి దానం చేయండి.

 

మీన రాశి: ఈరోజు మొండి బాకీలు వసూలు !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. దంపతుల అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థలాలకు ఆకస్మిక బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version