మేషరాశి : మిశ్రమ ఫలితాలు, అధిక ఖర్చులు, ధననష్టం, భాగస్వామితో ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు,ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర నల్లనువ్వులు, నల్లపూలతో ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.
వృషభరాశి : వస్త్రలాభం, ఆర్థికంగా పర్వాలేదు, బంధుమైత్రి, అలంకార వస్తువులు లభిస్తాయి/కొనుగోలు చేస్తారు. భాగస్వామితో ఆనందం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.
మిథునరాశి : వస్త్రలాభం, కొత్తవస్తువులు కొంటారు, బంధువుల రాక, విందులు, సోదరులతో స్వల్ప ఇబ్బందులు, ప్రయాణాలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
కర్కాటకరాశి : లాభం, వస్తులాభం, సోదరీ, సోదరుల రాక, వ్యాపారలాభం, పనులుపూర్తి, దేవాలయాలను దర్శిస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
సింహరాశి : వ్యతిరేక ఫలితాలు, చేసేపనిలో నష్టం, అకారణ విరోధాలు, ఆరోగ్య భంగం, స్థానమార్పులు, ఔషధసేవ, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర ఉప్పు, నల్ల పూలతో ప్రదక్షణలు మంచి చేస్తాయి.
కన్యారాశి : ప్రభుత్వ మూలక ధనలాభం, బంధువుల రాక, విందుభోజనం, పనులు పూర్తి, ప్రయత్నకార్య సఫలం.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన, ప్రదక్షణలు చేయండి.
తులారాశి : పూర్తి వ్యతిరేక ఫలితాలు, వివాదాలు, వస్తునష్టం, అధికారులతో ఇబ్బందులు, అనవసర ఖర్చులు.
పరిహారాలు: నవగ్రహాలకు ఉప్పు, నల్లని పూలతో ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి : అనుకూల వాతావరణం, లాభాలు, సంతానంతో సంతోషం, అలంకార వస్తువులు కొంటారు, ఆదాయం మించి ఖర్చు, ప్రయాణసూచన.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం చేయండి మంచిది.
ధనస్సురాశి : మిశ్రమ ఫలితాలు, అకారణంగా విరోధాలు, చేసే పనుల్లో లాభం, స్థానమార్పులు, విందులు, వినోదాలు.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి.
మకరరాశి : వస్తు, వస్త్రప్రాప్తి, యశోభూషణ లాభం, కుటుంబ సఖ్యత, రక్త సంబంధీకుల రాక, పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.
కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, కలహాలు, కీర్తిలాభం, అధిక ఆదాయం, ఖర్చులు అంతే ఉంటాయి, ఆరోగ్యం పర్వాలేదు, ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర నల్లపూలతో ప్రదక్షణలు చేయండి.
మీనరాశి : వ్యతిరేక ఫలితాలు, వస్తునష్టం, అలసట, అధికశ్రమ, విచారం, ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: నవగ్రహాలకు నల్లపూలతో ప్రదక్షణలు చేయండి.
నోట్: నవగ్రహాలకు కనీసం 9 ప్రదక్షణలు చేయండి. అదేవిధంగా ఉప్పు పిడికెడు, నల్లపూలు అంటే వయ్‌లెట్ లేదా బ్లూరంగు పూలు అయినా పర్వాలేదు. తీసుకుని చేతిలో పట్టుకుని ప్రదక్షణలు చేసి నవగ్రహాల దగ్గర పెట్టివస్తే తప్పక మంచి జరుగుతుంది. ఈ తంత్రం చాలా కాలంగా ఉత్తరాదిలో విశేషంగా చేస్తుంటారు. శనిదోషం, కుజదోషంతోపాటు నరదృష్టివంటి వాటికి ఈ తంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది.
– కేశవ