మేషరాశి : వ్యతిరేక ఫలితాలు, ఒత్తిడి, రుణబాధలు, వ్యవహార భంగం, అనారోగ్య సమస్యలు.
పరిహారాలు- కుజగ్రహం దగ్గర ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృషభరాశి : అన్నింటా నష్టం, సోదరి సహకారం, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇంట్లో మార్పులు, పనుల్లో జాప్యం.
పరిహారాలు- నవగ్రహాల దగ్గర ఎర్రపూలతో ప్రదోషకాలంలో ప్రదక్షణలు చేయండి.
మిథునరాశి : అధికారనష్టం, స్వల్ప అనారోగ్యం, ఆదాయంలో తగ్గదల, ఆర్థిక విషయాలు జాగ్రత్త, కుటుంబంలో ఇబ్బంది, అపనిందలు.
పరిహారాలు- నవగ్రహాల దగ్గర 11 ప్రదక్షణలు, దీపారాధన చేస్తే మంచిది.
కర్కాటకరాశి : అధికశ్రమ, ఆకస్మిక ప్రయాణాలు, కుటంబ కలహాలు, చెడువార్తా శ్రవణం
పరిహారాలు- నవగ్రహాల దగ్గర 11 ప్రదక్షణలు, దీపారాధన చేయండి.
సింహరాశి : వ్యతిరేక ఫలితాలు, అనుకోని నష్టాలు, మనోవ్యాకులత, కుటుంబంలో వివాదాలు, స్వల్ప అనారోగ్యం.
పరిహారాలు- నవగ్రహాల దగ్గర ఎర్రపూలతో ప్రాతః/ ప్రదోషకాలంలో ప్రదక్షణలు చేయండి
కన్యారాశి : బంధువుల రాక,కుటంబ సఖ్యత, భార్యతో ప్రయాణం, సంతోషం, ఇష్టాన్న భోజనం
పరిహారాలు- ఇష్టదేవతరాధన సరిపోతుంది.
తులారాశి : అనుకోని విజయాలు, అన్నింటా జయం,మాటకు గౌరవం, ధనలాభం, సంతోషం, దూర ప్రయాణ సూచన
పరిహారాలు- ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి : ప్రతికూల ఫలితాలు, స్త్రీమూలకంగా ధననష్టం, అధికారులతో విరోధం, వివాదాలు, అలసట, అనవసర తిరుగుడు.
పరిహారాలు- నవగ్రహాల దగ్గర ప్రాతఃకాలం/ప్రదోష కాలంలో 11 ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సురాశి : కుటుంబ సంతోషం, లాభం, వస్త్రలాభం, పనులు పూర్తి, కుటుంబ సంతోషం, అందరి సహకారం.
పరిహారాలు-ఇష్టదేవతరాధన చేయండి
మకరరాశి : ప్రయాణల్లో అలసట, అత్తవారితో సఖ్యత, అవమానాలు, అనవసర వివాదాలు, ప్రయాణ సూచన, కార్యాల్లో జాప్యం
పరిహారాలు-నవగ్రహాల దగ్గర ప్రదక్షణ సాయంత్రం పూట చేయండి లేదా దీపారాధన చేయండి.
కుంభరాశి : కార్యలాభం, పనులు పూర్తి, లాభం, అలసట, అందరి సహకారం, ఇష్టమైన వారు కలుస్తారు
పరిహారాలు- ఇష్టదేవతరాధన చేస్తే చాలు
మీనరాశి : అకాల భోజనం, అలసట, అనవసర తిరుగుడు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆందోళన, వస్తు నష్టం,
పరిహారాలు- నవగ్రహాల దగ్గర ప్రదక్షణలు, దీపారాధన చేయండి