Real Estate : తెలంగాణలో భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలని కొన్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వీటి మార్కెట్ విలువను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, ప్రాంతాల వారీగా నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం తెలుస్తుంది.
ఈ నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అనుమతి ఇవ్వనున్నారు. ఆయన పర్మిషన్ కనుక ఇస్తే ఇక ఇన్వెస్టర్లకి పండగే. ఎందుకంటే ప్రాపర్టీల మార్కెట్ విలువ పెరుగుతుంది. కమర్షియల్ ఏరియా, నాన్ కమర్షియల్ ఏరియా ఇలా ప్రాపర్టీని డివైడ్ చేసి మార్కెట్ వాల్యూని డిసైడ్ చెయ్యనున్నారు. గతంలో నాన్ కమర్షియల్ ఏరియాగా ఉండి ఇప్పుడు అక్కడ కమర్షియల్ గా డెవలప్ అయి ఉంటే స్థలాల మార్కెట్ విలువను పెంచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
భూములు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచేందుకు కూడా ప్రభుత్వం రెడి అయింది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ, ఓపెన్ మార్కెట్ విలువను రెండిటినీ బేరీజు వేసుకుని మార్కెట్ వాల్యూని పెంచే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్ల రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ వాల్యూలో 50 శాతం పైగా మార్కెట్ వాల్యూని పెంచకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. అపార్ట్మెంట్ కొనుగోలుపై మార్కెట్ వాల్యూ కన్నా 20 శాతం నుంచి 30 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఓపెన్ ప్లాట్ల మార్కెట్ వాల్యూని 50 శాతం లోపు ఎంతయినా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.
ఇక దీనికి సంబంధించి త్వరలో అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆగస్టు 15 వ తేదీ తర్వాత పెరిగిన మార్కెట్ ధరలు అమలులోకి వస్తాయని అధికార వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ 15 రోజుల్లోపు స్థలాలు కొనుగోలు చెయ్యడం మంచిది. ఈ పీరియడ్ లో ఎవరైతే స్థలాలు కొంటారో వారికి కచ్చితంగా లాభాలు ఉంటాయి. అలాగే అంతకు ముందు కొన్నవారు ఆగస్టు 15 వ తేదీ తర్వాత అమ్మితే వారికి కచ్చితంగా భారీ లాభాలనేవి ఉంటాయి. అందుకే ఎవరైనా స్థలం కొనాలని భావిస్తే ఆగస్టు 15 లోపు కొనేస్తే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు.