ఇడ్లి, సాంబార్, ఉప్మా, బిర్యాని… ఇవన్ని ఏంటి అనుకుంటున్నారా…? ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్ యాన్ లో పాల్గొనాల్సిన వ్యోమగాముల కోసం తయారు చేసిన ఆహార పదార్ధాలు. ఈ మేరకు జాతీయ మీడియా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. “మిషన్ గగన్యన్‌లో అంతరిక్షంలోకి వెళ్లాల్సిన భారతీయ వ్యోమగాముల కోసం, మైసూర్‌లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ,
ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, ఇడ్లీ, మూంగ్ దాల్ హల్వా, వెజ్ పులావ్ వంటి ఆహార పదార్థాలను తయారు చేసింది. వారికి ఫుడ్ హీటర్లు కూడా అందించబడతాయని ANI తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వ్యోమగాములు సున్నా గురుత్వాకర్షణలో ద్రవాలు తాగడానికి ప్రత్యేక కంటైనర్లు కూడా తయారు చేయడం విశేషం.
గగాన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను గుర్తించినట్లు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇటీవల తెలిపింది. రష్యాలో జనవరి మూడవ వారంలో శిక్షణ ప్రారంభమవుతుందని ఇస్రో చీఫ్ కె శివన్ తెలిపారు. ఇస్రో మహిళా వ్యోమగాములు మిషన్లో భాగం కావాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయోగాన్ని భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఇస్రో తన అంతరిక్ష పరిశోధనల్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది.