ఐఫోన్ ప్రియుల‌కు షాక్‌.. ధ‌ర‌ల‌ను పెంచిన ఆపిల్‌..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ త‌న ఐఫోన్ల ధ‌ర‌ల‌ను పెంచింది. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2020లో బేసిక్ క‌స్ట‌మ్స్ డ్యూటీ (బీసీడీ)ని పెంచిన సంగ‌తి తెలిసిందే. అలాగే సోష‌ల్ వెల్ఫేర్ స‌ర్‌చార్జి కింద బీసీడీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తూ వ‌చ్చిన మిన‌హాయింపును కూడా ఉప‌సంహ‌రించుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు ఐఫోన్ల ధ‌ర‌ల‌ను ఆపిల్ పెంచింది. అయితే ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ల‌ను భార‌త్‌లోనే త‌యారు చేస్తున్నందున ఈ ఫోన్ల ధ‌ర‌లు పెర‌గ‌లేదు. అలాగే ఐఫోన్ 11 ధ‌ర కూడా పెర‌గ‌లేదు. ఇక పెరిగిన ఐఫోన్ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

* ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ 64 జీబీ పాత ధ‌ర రూ.1,09,900 ఉండ‌గా ఇప్పుడిదే వేరియెంట్ ధ‌ర‌ రూ.1,11,200 గా ఉంది. అలాగే ఈఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.1,25,200గా ఉండ‌గా, 512 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.1,43,200గా ఉంది.

* ఐఫోన్ 11 ప్రొ 64జీబీ పాత ధ‌ర రూ.99,900 ఉండ‌గా, ఇప్పుడు దీన్ని రూ.1,01,200కు విక్ర‌యిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ప్ర‌స్తుత ధ‌ర రూ.1,15,200గా ఉండ‌గా, 512 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.1,33,200 గా ఉంది.

* ఐఫోన్ 8 64జీబీ ప్ర‌స్తుతం రూ.40,500 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా,, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.45,500గా ఉంది. అలాగే ఐఫోన్ 8 ప్ల‌స్ 64జీబీ వేరియెంట్ ధ‌ర రూ.50,600గా ఉంది. ఇదే ఫోన్ 128 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.55,600గా ఉంది.

ప్ర‌స్తుతం ఈ ఫోన్ల‌ను పెరిగిన ధ‌ర‌ల‌కే ఆపిల్ విక్ర‌యిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version