ఆపిల్ సంస్థ తన నూతన ఐఫోన్‌ను మే 20వ తేదీ నుంచి విక్రయించనుంది. గత కొద్ది రోజుల కిందటే ఆపిల్.. ఐఫోన్ ఎస్ఈ 2020ని విడుదల చేసిన విషయం విదితమే. ఎప్పటిలా ఈవెంట్‌లో కాకుండా ఆపిల్ ఈ సారి ఈ ఫోన్‌ను సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే పలు దేశాల మార్కెట్లలో అందుబాటులో ఉంది. కానీ భారత్‌లో లాక్‌డౌన్ కారణంగా ఈ ఫోన్ అమ్మకాలను ఇంకా ప్రారంభించలేదు. కానీ ప్రస్తుతం ఆంక్షలను సడలిస్తుండడం.. ఈ-కామర్స్ సంస్థలు తిరిగి డెలివరీలను ప్రారంభించడంతో.. ఇక ఆపిల్ కూడా తన ఐఫోన్ ఎస్ఈ 2020ని విక్రయించేందుకు సిద్ధమైంది.
ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 విక్రయాలు మే 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. రూ.42,500 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ను అమ్మనున్నారు. ఇక ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో రూ.3600 వరకు లిమిటెడ్ టైం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.38,900 ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ ఫోన్‌లో ఆపిల్ ఎ13 బయానిక్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 4.7 ఇంచుల డిస్‌ప్లే, టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 12, 7 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్టీఈ, 1821 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.