18 జీబీ ర్యామ్ తో విడుద‌లైన అసుస్‌ ఆర్‌వోజీ ఫోన్ 5 స్మార్ట్‌ఫోన్‌..!

-

అసుస్ కంపెనీ ఆర్‌వోజీ ఫోన్ 5 పేరిట ఓ నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో బుధ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌, 18 జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అందిస్తున్నారు.

ఈ ఫోన్ లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 13 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. 24 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎయిర్ ట్రిగ్గ‌ర్ 5 కంట్రోల్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. దీనికి 65 వాట్ల హైప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ 30 నిమిషాల్లోనే 70 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది. 52 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది. ఇందులో ప్ర‌త్యేక‌మైన కూలింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్ ఆడేట‌ప్పుడు, మూవీలు చూసేట‌ప్పుడు ఫోన్ ఎక్కువ‌గా హీట్ అవ‌కుండా ఉంటుంది.

అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 ఫీచ‌ర్లు…

* 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2448 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్
* 8/12/16/18 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
* డ్యుయ‌ల్ సిమ్‌, 64, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2
* యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 ‌కు చెందిన వివిధ వేరియెంట్ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

* అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 – 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ.49,999.
* అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 – 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ.57,999.
* అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 – 16జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ.69,999.
* అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 5 – 18జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ.79,999.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version