ఐ ఫోన్ 5 వాడుతున్న వారికి ఆందోళన కలిగించే చేదు వార్త. యాపిల్ కంపెనీ 2012లో అందుబాటులోకి తెచ్చిన ఐఫోన్ 5 మోడల్ ఫోన్ వినియోగిస్తున్నవారికి ఆ సంస్థ డెడ్‌లైన్ విధించింది. ఈ మోడల్ ఐఫోన్ వినియోగదారులు ఫోన్‌ను అప్‌డేట్ చేయకపోతే ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఈమెయిల్, వెబ్, ఇతర సర్వీసులు నిలిచిపోతాయని ఆ కంపెనీ పేర్కొంది. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మీ చేతిలో ఐ ఫోన్ ఉన్నా ఏ ఒక్క అవసరానికి ఉపయోగపడదని ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ హెచ్చరించింది.
ఫోన్‌ను ఐఓఎస్ వెర్షన్ 10.3.4కు సోమవారం మధ్యాహ్నం 12.30 లోపు అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ సంస్థ తెలిపింది. లేదంటే 12.30 గంటల తర్వాత ఫోన్‌లో ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేరని, డేట్ అండ్ టైమ్ జీపీఆర్ లోకేషన్ కూడా అప్‌డేట్ కావని యాపిల్ సంస్థ తెలిపింది. ఐఫోన్ 5ను అప్‌డేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి, జనరల్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అబౌట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే వెర్షన్ అప్‌డేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.