రివైండ్ 2024: ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ కార్స్ లిస్ట్ ..

-

ఈ సంవత్సరం మార్కెట్లో మంచి మంచి కార్లు లాంచ్ అయ్యాయి. ఎస్ యు వి నుండి మొదలుకొని రకరకాల కార్లు రోడ్లమీదకు వచ్చాయి. వాటన్నింటిలో బెస్ట్ కార్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

టాటా కర్వ్:

టాటా మోటార్స్ నుండి లాంచ్ అయిన టాటా కర్వ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అటు పెట్రోల్ వేరియంట్ తో పాటు ఎలక్ట్రానిక్ వేరియంట్ ని తీసుకొచ్చింది టాటా మోటార్స్. ఇంధనంతో నడిచే టాటా కర్వ్ ధర 9.99 నుండి 17.69(ఎక్స్ షోరూమ్) లక్షల మధ్య ఉంది. అలాగే టాటా కర్వ్ ఈవీ ధర 17.49 లక్షల నుండి 21.99(ఎక్స్ షోరూమ్) లక్షల వరకు ఉంది. ఈవీ వేరియెంట్లో రెండు బ్యాటరీ బ్యాకప్ లు వస్తాయి.

మారుతి సుజుకి డిజైర్:

మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన డిజైర్ కారు ధర 6.79 లక్షల నుండి 10.14 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. 22 నుండి 32 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ కారులో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 6 ఎయిర్ బ్యాగ్స్ దీని ప్రత్యేకం. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లతో రిలీజ్ అయింది.

మహేంద్ర థార్ రోక్స్:

మహీంద్రా నుండి విడుదలైన ఎస్ యు వి ధర 12.99 లక్షల నుండి మొదలై 22. 49 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సన్ రూఫ్, హై క్వాలిటీ ఆడియో సిస్టం ఇందులో ఉంది. పెట్రోల్ డీజిల్ రెండు ఇంధనాలకు సరిపడా ఇంజన్లతో రిలీజ్ అయింది మహేంద్ర థార్ రోక్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version