స్మార్ట్ ఫోన్లని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్స్ ని దొంగలిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు పోయిన వెంటనే ఏం చేయాలి..? మీ ఫోన్ కూడా పోయిందా అయితే ఇలా చేయండి. ఒక గంటలోపు మీరు వీటిని ఫాలో అయ్యారంటే అది మీకే ప్లస్ అవుతుంది. మీ స్మార్ట్ ఫోన్ పోయిన వెంటనే మొదట మీరు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వలన మీ ఫోన్ ని వాళ్ళు వెతికి పెడతారు మొబైల్ ఆపరేటర్ కి ఫోన్ చేసి సిమ్ కార్డు ని బ్లాక్ చేయించండి. సిమ్ కార్డ్ యాక్టివ్ గా ఉంటే వారిని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ని బ్లాక్ చేయడం చాలా అవసరం. ఆ తర్వాత ఫైండ్ మై ఐఫోన్ లేదా గూగుల్ ఫైండ్ మై డివైస్ వంటి ట్రాకింగ్ యాప్స్ ద్వారా మీ ఫోన్ ని మీరు కనుగొనడానికి అవుతుంది.
ఫోన్ పోయిన వెంటనే మీరు మీ బ్యాంక్ యొక్క పాస్వర్డ్ ని మార్చుకోవాలి. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లింక్ చేసి ఉన్నట్లయితే వాటిని తొలగించడం మంచిది. వాటిని కూడా బ్లాక్ చేసుకుంటే మరీ మంచిది. ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు వంటి వాటిని బ్యాకప్ చేయండి.
ఇలా మీ ఫోన్ పోయిన గంటలోపు మీరు వీటిని ఫాలో అయినట్లయితే మీ ఫోన్ లో ఉన్న డేటా అంతా సురక్షితంగా ఉండడమే కాకుండా మీ ఫోన్ సిమ్ కార్డ్ ని ఎవరు దుర్వినియోగం చేయకుండా ఉంటారు. అలాగే మీ ఫోన్ పోయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఫోన్ పోయిన గంటలోపు కచ్చితంగా మీరు వీటిని ఫాలో అయ్యేటట్టు చూసుకోండి అప్పుడు ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవని గుర్తు పెట్టుకోండి లేదంటే ఇబ్బందుల్లో ఇరుకోవాల్సి ఉంటుంది.