ముఖ్యమైన కాల్స్ మాత్రమే వినిపించాలా..? అయితే ఇలా చేయండి..!

-

నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నిద్రపోయేటప్పుడు ఫోన్ ని సైలెంట్లో పెట్టుకోవాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇంపార్టెంట్ ఫోన్స్ మిస్ అయిపోతామేమో అని ఒక టెన్షన్ ఉంటుంది. మనిషికి ఆహారం లాగే నిద్ర చాలా అవసరం. పగలు ఎంత పని చేసినా రాత్రి హాయిగా నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్ వలన నిద్రకి ఆటంకం కలుగుతుంది.

స్మార్ట్ ఫోన్లో డోంట్ డిస్టర్బ్ మోడ్ ని ఆక్టివేట్ చేస్తే ముఖ్యమైన, కావాల్సిన సందేశాలని మాత్రమే పొందవచ్చు. ఒక నిర్దిష్ట సమయంలో ఆటోమెటిగ్ గా DND యాక్టివేట్ చేసే ముఖ్యమైనవి కావాల్సినవి మాత్రమే అనుమతించే సెట్టింగ్స్ గురించి చూద్దాం. దీనికోసం మొబైల్ సెట్టింగ్స్ కి వెళ్ళండి. డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఆప్షన్స్ లో డు నాట్ డిస్టర్బ్ ని ఎంచుకోండి. జనరల్ కింద షెడ్యూల్స్ అనే ఆప్షన్ ని నావిగేట్ క్లిక్ చేయండి. షెడ్యూల్స్ లో స్లీపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిద్ర షెడ్యూల్ ప్రకారం సమయాన్ని సర్దుబాటు చేసుకోండి. యాడ్ మోర్ పై క్లిక్ చేసి దాని ద్వారా మరిన్ని షెడ్యూల్లను జత చేయొచ్చు. అలాగే కాల్స్ సందేశాల కోసం ప్రాధాన్యతని సెట్ చేయాలి. అలారం కెన్ ఓవర్ రైడ్ అండ్ టైం టోగుల్ ఎనేబుల్ అయిందో లేదో చూసుకోండి. ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా ఫోన్లో డిఎన్డి మోడ్ ఆన్ అవుతుంది కేవలం ముఖ్యమైన కాల్స్ మాత్రమే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version