మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్త‌మ ఎల‌క్ట్రిక్ సైకిల్స్ ఇవి..!

-

ప్ర‌స్తుత త‌రుణంలో ఇంధ‌న ధ‌ర‌లు మండిపోతున్నాయి. రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. దీంతో సొంత వాహ‌నాల‌ను వాడాలంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. అయితే మార్కెట్‌లో ప్ర‌స్తుతం అనేక ర‌కాల ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అందుబాటులో ఉండ‌డంతో ఇంధ‌న ధ‌ర‌ల నుంచి విముక్తి పొందేందుకు వాహ‌న‌దారులు వాటిని ఉప‌యోగిస్తున్నారు. కానీ అవి ఎక్కువ ధ‌ర‌ల‌ను క‌లిగి ఉంటున్నాయి. అయితే రోజూ చిన్న‌పాటి దూరం ప్ర‌యాణించేవారికి త‌క్కువ ధ‌ర‌ల్లోనే అధిక మైలేజీ ఇచ్చే ఎల‌క్ట్రిక్ సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నెక్స్‌జు మొబిలిటీ కంపెనీ లాంచ్ చేసిన సరికొత్త రోడ్ లార్క్ ఎల‌క్ట్రిక‌ల్ సైకిల్ ఒక్క‌సారి ఫుల్ చార్జి అయితే 100 కిలోమీట‌ర్ల మైలేజీ ఇస్తుంది. స్టీల్ ఫ్రేమ్‌తో ఈ సైకిల్‌ను రూపొందించారు. రిమూవ‌బుల్ బ్యాట‌రీ, డ్యుయ‌ల్ డిస్క్ బ్రేక్ లను ఇందులో అందిస్తున్నారు. ఈ సైకిల్‌పై గంట‌కు గ‌రిష్టంగా 25 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చు. ఈ సైకిల్ ధ‌ర రూ.42వేలుగా ఉంది.

యూకేకు చెందిన గోజీరో మొబిలిటీ కంపెనీ స్కెలిగ్ ప్రొ సైకిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సైకిల్‌ను ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 70 కిలోమీట‌ర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 7 స్పీడ్ గేర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌ల‌ను అమ‌ర్చారు. ఈ సైకిల్ గంట‌కు గ‌రిష్టంగా 25 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఈ సైకిల్ ధ‌ర రూ.34,999గా ఉంది.

బెంగ‌ళూరుకు చెందిన టౌట్‌చె కంపెనీ హీలియో ఎం100 సైకిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 60 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. దీని ధ‌ర రూ.49,900గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version