కరోనా నుంచి కోలుకుని బయటపడిన వారిలో బ్లాక్ ఫంగస్ ఇప్పుడు భయపెడుతుంది. బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఇప్పుడు సామాన్య ప్రజలు బయటకు రావాలంటే కంగారు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే దీనికి సంబంధించి కొన్ని సంచలన విషయాలను పరిశోధకులు బయటపెట్టారు. రోగులకు అపరిశుభ్రమైన ఆక్సిజన్ పంపిణీ కూడా బ్లాక్ ఫంగస్ కి కారణం అని అనుమానాలు వస్తున్న నేపధ్యంలో పారిశ్రామిక ఆక్సీజన్ బ్లాక్ ఫంగస్ కి కారణం అని కొందరు అభిప్రాయపడ్డారు.
మధుమేహం మరియు అధిక మోతాదు స్టెరాయిడ్స్ వాడకం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు గుర్తించారు. సిలిండర్ల పరిశుభ్రత విషయంలో రాజీ పడటం కూడా బ్లాక్ ఫంగస్ కి కారణం అని పడవచ్చు అని అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు. రెండవది, హ్యూమిడిఫైయర్ బాటిళ్లలో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి అని సూచించారు. ఆక్సిజన్ కొరత కారణంగా, ఇద్దరు రోగులు ఒకే సిలిండర్ రోగులు వాడటం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు అని భావిస్తున్నారు.