స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్న బెస్ట్ పే లేట‌ర్ యాప్స్ ఇవే..!

-

ఒక్కోసారి మ‌న‌కు చాలా చిన్న చిన్న అవ‌స‌రాల‌కు డ‌బ్బు అవ‌సరం అవుతుంటుంది. కానీ చేతిలో డ‌బ్బు ఉండ‌దు. దీంతో చిన్న మొత్తాల‌ను ఎవ‌రినైనా అప్పు అడ‌గాల‌న్నా నామోషీగా ఉంటుంది. చిన్న అవ‌స‌రానికి డ‌బ్బు దొరికితే చాలు, కొన్ని రోజుల్లో మ‌ళ్లీ క‌ట్టేయ‌వ‌చ్చు.. అని భావిస్తుంటారు. అయితే అలాంటి వారి కోస‌మే ప‌లు పే లేట‌ర్ యాప్‌(Pay Later App)లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. లేజీ పే (Lazy Pay) అనే యాప్ లో ఆధార్‌, పాన్ నంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. దీంతో యూజ‌ర్ క్రెడిట్ హిస్ట‌రీ, స్కోరును బ‌ట్టి క్రెడిట్ లిమిట్ ఇస్తారు. అందులో ఉండే క్రెడిట్ లిమిట్‌ను ఏ విధంగా అయినా వాడుకోవ‌చ్చు. నెల‌కు రెండు సార్లు బిల్లింగ్ అవుతుంది. ప్ర‌తి నెలా 3వ తేదీ, 18వ తేదీన బిల్లు చెల్లించాలి. చిన్న చిన్న అవ‌స‌రాల‌కు ఇందులో అందించే క్రెడిట్ లిమిట్ బాగా పనిచేస్తుంది.

2. లేజీ పే లాగే సింపుల్ (Simpl) అనే యాప్ కూడా క్రెడిట్ లిమిట్ ఇస్తుంది. ఇందులోనూ బిల్లుల‌ను 15 రోజుల‌కు ఒక‌సారి చెల్లించాలి. అనేక వెబ్‌సైట్ల‌లో ఈ యాప్ అందించే క్రెడిట్ లిమిట్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

3. డిజిట‌ల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ త‌న యాప్‌లో జిప్ లేట‌ర్ అనే స‌ర్వీస్‌ను అందిస్తోంది. ఇందులోనూ క్రెడిట్ లిమిట్ ఇస్తారు. 15 రోజుల‌కు ఒక‌సారి బిల్లు చెల్లించాలి. క్రెడిట్ లిమిట్‌తో అనేక బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

4. పేటీఎంలో పేటీఎం పోస్ట్ పెయిడ్ అనే స‌ర్వీస్‌ను అందిస్తున్నారు. ఇందులో క్రెడిట్ లిమిట్ వ‌స్తుంది. కానీ దీనికి బిల్లును నెల‌కు ఒక‌సారి చెల్లించాలి.

5. ఫ్లెక్స్ పే అనే మ‌రో యాప్‌లోనూ క్రెడిట్ లైన్ ఇస్తారు. ఇది యూపీఐ ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తుంది. అలాగే ఇపేలేట‌ర్‌, జెస్ట్ పే అనే మ‌రో రెండు యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోనూ క్రెడిట్ లిమిట్ ఇస్తారు. దాన్ని ఎలాగైనా వాడుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆయా యాప్‌ల‌లో ఉండే బిల్లింగ్ సైకిల్ ప్ర‌కారం బిల్లు వ‌స్తుంది. 15 రోజులు లేదా నెల రోజుల‌కు ఒక‌సారి బిల్లు జ‌న‌రేట్ అవుతుంది. దీంతో బిల్లును చెల్లిస్తూ ఎప్ప‌టిలా క్రెడిట్ లిమిట్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version