ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జ‌న‌వ‌రి 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వ‌హించ‌నుంది. ఇందులో భాగంగా ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌భ్యుల‌కు మంగ‌ళ‌వారం నుంచే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. రిపబ్లిక్ డే సంద‌ర్బంగా ఈ సేల్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్ ఫోన్‌ను రూ.27,999 ధ‌ర‌కే కొన‌వ‌చ్చు. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ మోడ‌ల్ ఫోన్‌ను రూ.12,501 త‌గ్గింపుతో రూ.36,999 ధ‌ర‌కు, యాపిల్ ఐఫోన్ 12 మినీని రూ.3వేల త‌గ్గింపుతో రూ.64,900కు, ఐఫోన్ 11 64జీబీ ఫోన్‌ను రూ.5,901 త‌గ్గింపుతో రూ.48,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొందాలంటే వినియోగ‌దారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ సేల్‌లో ఎల్‌జీ జీ8ఎక్స్ థిన్‌క్యూ, అసుస్ రోగ్ ఫోన్ 3, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్ల‌స్‌, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్‌, పోకో సి3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రొ, పోకో ఎక్స్‌3, రియ‌ల్‌మి ఎక్స్‌3, నార్జో 20 ప్రొ, రియ‌ల్‌మి 7, సి15, రియ‌ల్‌మి 6, ఎక్స్‌50 ప్రొ 5జి, సి3, 5జి, మోటో రేజ‌ర్ 2019, మోటో జి9, మోటో ఎడ్జ్ ప్ల‌స్‌, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఒప్పో ఎ12 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అలాగే ఎంఐ టీవీ స్టిక్, అమేజ్ ఫిట్ స్మార్ట్ బ్యాండ్‌లు, వాచ్‌లు, రియ‌ల్‌మి వాచ్‌లు, బ్యాండ్‌లు, సౌండ్ బార్‌లు, స్మార్ట్ హోం డివైస్‌ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, టీవీలను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version