విండోస్ 11 తీసుకున్నారా..? అయితే ఈ హిడెన్ ఫీచర్స్ ని తెలుసుకోండి..!

-

విండోస్ లెవెన్ తీసుకున్న వాళ్ళు ఈ కొత్త ఫీచర్స్ ని ప్రయత్నం చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్స్ మనం వర్క్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. మీరు వర్క్ చేసుకోవడానికి కంప్యూటర్ వాడిన లేదు అంటే పర్సనల్ లైఫ్ కోసం వాడిన ఈ ఫీచర్లను తప్పక చూడాలి. టాస్క్ బార్ షార్ట్ కట్స్ మొదలు బ్యాటరీ పవర్ సేవింగ్ వరకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ వున్నాయి. మరి ఆలస్యమెందుకు వాటికోసం చూసేద్దాం.

యాక్టివ్ విండో తప్ప మిగిలినవన్నీ మినిమైజ్ చేసుకోండి:

మనం ఎక్కువగా విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటాము. దీంతో మొత్తం చాలా పేజెస్ ఓపెన్ అయి ఉంటాయి. అయితే మీరు ఆక్టివ్ విండోని ఒక్కటి ఉంచి మిగిలినవన్నీ కూడా మినిమైజ్ చేసుకోవచ్చు.

సీక్రెట్ స్టార్ట్ మెనూ:

సీక్రెట్ స్టార్ట్ మెనూ కోసం మీరు Windows key + X, or right click the Windows icon/Start button క్లిక్ చేయండి. ఇలా రెండు విధాలుగా మీరు సీక్రెట్ స్టార్ట్ మెనూ ఫీచర్ ని ఉపయోగించచ్చు.

ఇలా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు:

మీరు కనుక స్క్రీన్షాట్ తీసుకోవాలంటే Windows key + Print Screen key, ని క్లిక్ చెయ్యండి. అప్పుడు ఆ పిక్చర్ సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్ మీద ఒక పార్ట్ ని స్క్రీన్ షాట్ చేయాలంటే Windows key + Shift + S క్లిక్ చేస్తే స్నిప్ అండ్ స్కెచ్ ఓపెన్ అవుతుంది.

యాప్ కి స్పేస్:

మీరు ఏ యాప్ కి ఎంత స్పేస్ పడుతోంది అనేది చూడాలంటే Settings > System > Storage. Tap Show more categories క్లిక్ చేస్తే అప్పుడు మీకు స్టోరేజ్ కనబడుతుంది. ఇలా మీరు ఏ యాప్ కి ఎంత స్పేస్ పడుతోంది అనేది చూడచ్చు.

బ్యాటరీ సేవ్:

బ్యాక్గ్రౌండ్ ఆప్స్ ని క్లోజ్ చేయండి. మీరు బ్యాటరీ సేవ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ సిస్టం లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరు పవర్ బ్యాటరీ మీద క్లిక్ చేయండి. బ్యాటరీ సేవర్ మీద క్లిక్ చేస్తే బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

డిస్ట్రక్షన్స్ ని ఇలా ఆపచ్చు:

కొన్ని కొన్ని సార్లు మనకి నోటిఫికేషన్స్ వల్ల చికాకు వస్తుంది. వీటిని ఆపాలంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ సిస్టం లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరు ఫోకస్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసి వాటిని ఆఫ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version