తిరుమల భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 75, 737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23, 208 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 4.16 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు మొన్న పిబ్రవరి,వయోవృద్ధులు, వికలాంగుల టిక్కెట్లు విడుదల అయ్యాయి.
ఇక అటు ఇవాళ ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. టిటిడి పాలక మండలి వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి.
తిరుమల..02 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75737 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 23208 మంది భక్తులు
హుండి ఆదాయం 4.14 కోట్లు