ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ భారత్‌లో పెవిలియన్ సిరీస్‌లో నూతన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. పెవిలియన్ 13, 14, 15 సిరీస్‌లలో ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. వీటిల్లో ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లు, ఇంటిగ్రేటెడ్ జీపీయూ, డెడికేటెడ్ ఎన్వీడియా జీపీయూలు తదితర ఫీచర్లను అందిస్తున్నారు. వీటిని రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్‌తో తయారు చేయడం విశేషం.
కాగా అన్ని ల్యాప్‌టాప్‌లు 3డి సీమ్‌లెస్ మెటల్ చాసిస్‌ను కలిగి ఉన్నాయి. స్లీక్, క్లీన్ లుక్‌ను కలిగి ఉన్నాయి. పెవిలియన్ 13 ల్యాప్‌టాప్ లు ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఆప్షన్‌తో లభిస్తుండగా, పెవిలియన్ 14, 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లలో హెచ్డీ, ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఆప్షన్లు లభిస్తున్నాయి.
పెవిలియన్ 13 ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ ఐరిస్ జి ఇంటిగ్రేడెట్ జీపీయూను ఏర్పాటు చేశారు. పెవిలియన్ 14, 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎన్‌వీడియో జిఫోర్స్ ఎంఎక్స్450 గ్రాఫిక్ కార్డు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లు సుమారుగా 8.5 నుంచి 8.75 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటిల్లో వైఫై 6కు సపోర్ట్‌ను అందిస్తున్నారు.
హెచ్‌పీ పెవిలియన్ 13 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.71,999 ఉండగా, 14 సిరీస్ ల్యాప్‌టాప్‌లు రూ.62,999 ప్రారంభ ధరకు, 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లు రూ.69,999 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి.