సూపర్ టెక్నాలజీతో వచ్చేసిన హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌!

-

హ్యుందాయ్ కంపెనీ డ్యూయల్‌ సీఎన్‌జీతో నడిచే ఎక్స్‌టర్‌ని విడుదల చేసింది. సీఎన్‌జీ కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ఫేమస్‌ కారుని సీఎన్‌జీ రూపంలో రిలీజ్ చేసింది హ్యుందాయ్ కంపెనీ.ఈ సీఎన్‌జీ కారు మోడల్లో 2 సిలిండర్ల టెక్నాలజీని కంపెనీ జోడించింది. ఇంతకుముందు ఒక సిలిండర్‌ని మాత్రమే పెద్ద సైజులో అందించింది. కానీ ఇప్పుడు రెండు చిన్న సిలిండర్లలో మేకర్స్ అందిస్తున్నారు. అందువల్ల కార్ బూట్ స్పేస్ కాస్త పెరిగింది. దీనివల్ల లాంగ్ డ్రైవ్‌లో ఎక్కువ లగ్గేజీ క్యారీ చేసుకోవచ్చు.ఇప్పటి దాకా కేవలం టాటా మోటార్స్‌లో డ్యూయల్‌ సిలిండర్‌ ఆప్షన్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌లో కూడా ఫస్ట్ టైమ్ రెండు సీఎన్‌జీ సిలిండర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇకపై సీఎన్‌జీ విభాగంలో టాటా మోటార్స్‌తో హ్యుందాయ్ కంపెనీ గట్టి పోటీని ఇస్తుంది. ఎక్స్‌టర్‌ కార్ టాటా పంచ్‌కి పోటీగా ఈ కారుని రిలీజ్ చేసింది.

టాటా పంచ్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్, బై-ఫ్యూయల్ ఇంకా ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్‌లలో లభిస్తుంది.ఇక ఎక్స్‌టర్‌ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కాకుండా, హ్యుందాయ్ త్వరలో ఈ కారు మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ని ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఈమధ్యనే ఈ కారును ఇన్‌స్టర్ ఈవీతో కలిపి గ్లోబల్ మార్కెట్‌లో పరిచయం చేసింది. ఇది ఎక్స్‌టర్‌ సీఎన్‌జీ S, SX ఇంకా SX నైట్ ఎడిషన్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది.ఈ కారు ధర విషయానికి వస్తే బేసిక్ వేరియంట్ రూ. 8.50 లక్షలుగా ఉంది.ఇక టాప్‌ వేరియంట్ ధర రూ. 9.38 లక్షలుగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు.

ఎక్స్‌టర్‌ నైట్ ఎడిషన్ సాధారణ ఎక్స్‌టర్‌ కారు మోడల్ కంటే మరింత అందంగా ఉంటుంది.నైట్‌ ఎడిషన్‌ ఆకర్షణీయమైన కలర్‌, స్పెషల్ యాక్ససరీలతో డిజైన్ చేయబడింది. ఈ సీఎన్‌జీ కారులో కొత్తగా ట్విన్ సిలిండర్లతో పాటు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంది. ఇది పెట్రోల్ నుంచి సీఎన్‌జీ ఇంకా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కి మారేటప్పుడు మంచి ఇంజిన్‌ ఫర్ఫామెన్స్ కి ఉపయోగపడుతుంది.ఈ కారు ఇప్పటికే దేశంలో మంచి రెస్పాన్స్‌ని కలిగి ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు మాక్సిమం లీటరుకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు లీటరుకు 19.2 కిలోమీటర్ల నుంచి 19.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version