BRS: మళ్లీ గులాబీ గూటికి రానున్న గద్వాల ఎమ్మెల్యే ?

-

MLA Bandla Krishna Mohan Reddy Into BRS Again: మళ్లీ గులాబీ గూటికి రానున్నారట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.

MLA Bandla Krishna Mohan Reddy Into BRS Again

ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఫ్లెక్సీలు, ఫోటోల వ్యవహారం చర్చనీయంశంగా మారింది. పార్టీ మారినా బీఆర్ఎస్ ఫ్లెక్సీ లు, కెసిఆర్ ఫోటో లు తొలగించలేదు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. తన ఇంట్లో కేసీఆర్‌తో దిగిన ఫోటోలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. కార్యకర్తలు తొలగిద్దామన్న వద్దని వారించారట కృష్ణ మోహన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగరని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వర్గం చర్చించుకుంటున్నదట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version