విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది..అనకాపల్లి తరహాలోనే జైలు నుంచి వచ్చి !

-

విశాఖలో మరో ప్రేమోన్మాది..రెచ్చిపోయాడు. అనకాపల్లి రాంబిల్లి తరహాలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పొక్సో కేసులో జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చి హత్యాయత్నం చేశాడు. తృటిలో హత్య తప్పింది. విశాఖలోని న్యూపోర్ట్ పరిధిలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిన్న రాత్రి వుడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో హత్యయత్నం చేయడానికి ప్రయత్నించాడు సిద్ధు అనే యువకుడు.

In Visakha, another lover attacked the young woman with a knife

అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో యువతి తల్లి సింగపల్లి సావిత్రి చేతికి గాయం అయింది. ఏప్రిల్ నెలలో యువతి కాలేజ్ వద్ద నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్స్ కేసు నమోదు చేసిన రిమాండ్ కి తరలించారు గాజువాక పోలీసులు. నిందితుడు పరారిలో ఉండటంతో, గాలింపు చేస్తున్నారు న్యూపోర్ట్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version