మొబైల్స్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత్‌లో నూతన స్మార్ట్ టీవీలను కొత్తగా లాంచ్ చేసింది. ఎక్స్1 సిరీస్‌లో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ టీవీలు విడుదలయ్యాయి. 32 ఇంచుల టీవీలో హెచ్‌డీ రిజల్యూషన్, 43 ఇంచుల టీవీలో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ లభిస్తుంది. వీటిలో అద్భుతమైన పిక్చర్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల దృశ్యాలు చాలా నాణ్యంగా కనిపిస్తాయి.
ఇన్ఫినిక్స్ 32ఎక్స్1, 43ఎక్స్1 టీవీల ఫీచర్లు…
* 32 ఇంచుల టీవీ – 1366×768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే
* 43 ఇంచుల టీవీ – 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఇన్ఫినిక్స్ ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్, లో బ్లూ లైట్ ఎమిషన్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్
* క్వాడ్ కోర్ మీడియాటెక్ 6683 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0
* బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్‌స్టార్
* బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్, ఆప్టికల్ ఔట్‌పుట్, మినీ ఏవీ
* ఐఆర్ రిమోట్, బ్లూటూత్ రిమోట్ (43 ఇంచుల టీవీకి), డాల్బీ ఆడియో
ఇన్ఫినిక్స్ 32ఎక్స్1 మోడల్ టీవీ ధర రూ.11,999 ఉండగా, ఇన్ఫినిక్స్ 32ఎక్స్1 మోడల్ టీవీ ధర రూ.19,999గా ఉంది. వీటిని డిసెంబర్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు.