గేమింగ్ ప్రియుల‌కు స‌ద‌వ‌కాశం.. రూ.12.50 ల‌క్ష‌లు గెలుచుకునే చాన్స్‌..

-

మీరు మొబైల్‌ గేమ్స్‌ బాగా ఆడుతారా ? అయితే టెలికాం కంపెనీ జియో మీకు అద్భుత అవకాశం అందిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న గేమింగ్‌ టోర్నమెంట్‌లో ఏకంగా రూ.12.50 లక్షలను గెలుచుకునే అవకాశాన్ని జియో అందిస్తోంది. ఇందుకు గాను జియో ప్రముఖ చిప్‌ తయారీ దారు మీడియాటెక్‌తో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే గేమింగ్‌ మాస్టర్స్‌ పేరిట ఓ మొబైల్‌ గేమింగ్‌ టోర్నమెంట్‌ను త్వరలో నిర్వహించనున్నారు.

జియో, మీడియాటెక్‌ కంపెనీలు నిర్వహించనున్న గేమింగ్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌కు గాను డిసెంబర్‌ 29వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. https://play.jiogames.com/esports అనే లింక్‌ను సందర్శించి గేమింగ్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు గేమింగ్‌ ప్రియులు రిజిస్టర్‌ చేయించుకోవచ్చు. ఇక జనవరి 13 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఇందులో భాగంగా ఫ్రీ ఫైర్‌ అనే బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌ను ఆడితే అందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.12.50 లక్షలను అందజేస్తారు. ఈ టోర్నమెంట్‌ జియో గేమ్స్‌ ప్లాట్‌ఫాంపై జరగనుంది. ఈ టోర్నమెంట్‌ను జియో టీవీ హెచ్‌డీ ఇస్పోర్ట్స్‌ చానల్‌, యూట్యూబ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఇక ఈ టోర్నమెంట్‌లో జియో, నాన్‌ జియో కస్టమర్లు ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందుకు గాను ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు https://i.mediatek.com/free-fire-gaming-master-Jioesport అనే లింక్‌ను సందర్శించవచ్చు. దేశంలోని గేమింగ్‌ ప్రియుల కోసం ఈ టోర్నమెంట్‌ను సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు జియో, మీడియాటెక్‌ సంస్థలు తెలిపాయి. ఇక ఇటీవలే జియో గేమ్స్‌ మొదటి సారిగా ఇండియా కా గేమింగ్‌ చాంపియన్‌ అనే టోర్నమెంట్‌ను నిర్వహించగా.. త్వరలో జరగనున్న గేమింగ్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ జియోకు రెండో టోర్నమెంట్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version