దేశీయ మార్కెట్‌లో ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది…అదే Infinix INBook X2 Plus ల్యాప్ టాప్. ఈ కంపెనీ నుంచి వస్తున్న నాలుగో ల్యాప్ టాప్ ఇది.
Infinix INBook X2 Plus ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర..
Infinix INBook X2 Plus ల్యాప్ టాప్ 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది
.
అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటాలిక్ బాడీని కలిగి ఉంది, ఇది వీడియో కాలింగ్ కోసం 1080p వెబ్ క్యామ్ తో పాటు LED ఫ్లాష్ ను కలిగి ఉంది.
ఇది డ్యూయల్ మైక్రోఫోన్‌లు, 1.5W డ్యూయల్ స్పీకర్‌లతో అమర్చబడింది.
Intel Core i7 11వ జెనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.
Infinix INBook X2 Plus లాప్ టాప్ కోర్ i3, 8GB + 256GB వేరియంట్ ధర రూ.32,990గా కంపెనీ నిర్ణయించింది.
512GB వేరియంట్ ధర రూ.35,990గా ఫిక్స్ చేసింది. ఈ ల్యాప్ టాప్ రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.
కోర్ i5 కి చెందిన 8GB + 512GB ధర రూ.42,990 కాగా, కోర్ i7 16GB + 512GB ధర రూ.52,990 గా నిర్ణయించింది.
ఇది 50Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది గరిష్టంగా 10 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది.
65W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ గ్రే, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్నాయి.
అక్టోబర్ 18 నుంచి అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం…
Infinix 43 Y1 స్మార్ట్ టీవీని కూడా కంపెనీ పరిచయం చేసింది. Infinix 43Y1 స్మార్ట్ టీవీ 43-అంగుళాల పూర్తి-HD (1,920×1,080 పిక్సెల్‌లు) LED డిస్‌ప్లేతో పాటు 300 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. ఇది స్పష్టమైన చిత్రాల కోసం HLG సపోర్టును కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 20W ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న బాక్స్ స్పీకర్‌లతో అమర్చబడింది. డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. Infinix 43Y1 స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో రూ. రూ. 13,999కి లభ్యం అవుతుంది.