కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేటీఆర్ హన్మకొండ జిల్లాలో పర్యటించిన విషయం విధితమే.  ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలకు స్పందించిన నాయిని.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కూర్చొని కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఏమైందని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే స్వేచ్ఛను హరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని.. ఇందిరా పార్కు చౌక్ ఎత్తేసింది మీరు కాదా..? అని నిలదీశారు. బీఆర్ఎస్ పథకాలు అన్నీ దోపిడీ చేసేందుకే తీసుకొచ్చారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో చేయలేని పనులను మేము చేస్తున్నామని పేర్కొన్నారు. అసలు కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version