విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయిందని.. మిగతాది త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటేడ్ కంపెనీ రూ.70వేల కోట్ల ప్రాజెక్టును వేరే రాష్ట్రాల్లో పెట్టాలనుకున్నా. దానిని ఏపీకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. 

ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ కుటీర పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. భవిష్యత్ లో స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version