చల్లారిన కాఫీ, టీ, పాలు వేడి చేసేందుకు మినీ హీటర్‌.. కాస్ట్‌ చాలా తక్కువండీ !!

-

మార్కెట్లో మన అవసరాలకు తగ్గట్టుగా చాలా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అవి ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అరే ఇలా ఒకటి తయారు చేస్తే బాగుండూ అనుకుంటారు. కాఫీ చల్లారిపోయిన తర్వాత మళ్లీ ఆ కప్పు కాఫీని గిన్నెలో వేసి వేడి చేసి కప్పులో పోస్తే అది సగం అవుతుంది, టేస్ట్‌ మారుతుంది. వాటర్‌ హీటర్‌లాగా కాఫీ, టీల కోసం హీటర్‌ ఉంటే బాగుండూ అనిపించిందా..? అయితే ఇది మీకోసమే.. మినీ హీటర్‌తో స్టవ్‌ లేకుండానే వేడి వేడిగా కాఫీ, టీ చేసుకోవచ్చు. దీని ధర ఇందులో ఉన్న ఫీచర్స్‌ ఏంటో చూద్దామా..!

ఇది ALLIED SALES INDIA బ్రాండ్ నుంచి వచ్చిన SR-01 న్యూ ఎలక్ట్రిక్ మినీ హీటర్ బాయిలర్ ఇమ్మెర్షన్ రాడ్డు. దీన్ని కాఫీ, టీ, పాలు వంటివి వేడి చేసుకోవడానికి వాడుకోవచ్చు. దీన్ని కప్పులో ఉంచి.. టీ, కాఫీ, సూప్ వంటివి వేడిచేసుకోవచ్చు. దీని బరువు 100 గ్రాములు. సైజు చూస్తే.. పొడవు 19, వెడల్పు 14, ఎత్తు 4 సెంటీమీటర్లు ఉంటుంది.

ఇది 220 ఓల్టుల ఓల్టేజ్ కలిగివుంది. ఇది కరెంటును బాగానే ఆదా చేస్తుంది. దీన్ని ఇండియాలోనే తయారుచేస్తున్నారు. తేలిగ్గా, మోడ్రన్ డిజైన్‌తో తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. దీనికి చాలా పొడవైన కార్డ్ ఇచ్చారు. అందువల్ల స్విచ్ బోర్డ్ దగ్గరగా లేకపోయినా.. ఈ పొడవైన 90 సెంటీమీటర్ల వైరుతో కనెక్ట్ చేసుకోవచ్చు.

వర్షాకాలంలో ఇలాంటిది ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే.. చిన్న చిన్నగా వెంటనే వేడి చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కొంతమంది బాత్‌రూంలో మగ్గులో నీటిని వేడి చేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే తినే వాటికోసం అయితే కేవలం వాటికోసం మాత్రమే వాడాలి.

దీన్ని నీటిలో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చెయ్యాలి. అలాగే.. నీరు ఎప్పుడూ రౌండ్ హీటింగ్ పార్ట్ కంటే పైకి ఉండాలి. బ్యాక్‌లైట్ హ్యాండిల్ మాత్రం నీటిలో మునగకుండా చూసుకోవాలి.

దీని అసలు ధర రూ.499 కాగా అమెజాన్‌లో దీనిపై 62 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.191కి అమ్ముతున్నారు. దీనికి అమెజాన్‌లో 3.5/5 రేటింగ్ ఉంది. 300 మందికి పైగా కొనుక్కున్నారు. చాలా మంది పర్లేదు బాగానే ఉంది అంటున్నారు.

దీనికి అమెజాన్‌లో 3.5/5 రేటింగ్ ఉంది. 300 మందికి పైగా కొనుక్కున్నారు. చాలా మంది పర్లేదు బాగానే ఉంది అంటున్నారు.

https://www.amazon.in/ALLIED-SALES-INDIA-SR-01-Immersion/dp/B07X3NQQCP మీకు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలా ఒక ప్రొడెక్టు కూడా ఉంది అని మాత్రమే మీకు చెప్తున్నాం కానీ ఇది ఏమాత్రం మార్కెటింగ్‌, లేక ప్రచారం కాదు. సాధారణంగా అనుకుంటారు కాదా.. చల్లారిన పాలు, టీ, కాఫీ వేడిచేయడానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు మళ్లీ స్టవ్‌ ఏం వేలిగిస్తాం.. చిన్న చిన్న వాటికే గిన్నె మాడిపోతుంది అనీ… సో.. అలాంటివాళ్లకు యూస్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version