తెలంగాణ మైనార్టీలకు రూ.లక్ష.. మార్గదర్శకాలు ఇవే

-

మైనారిటీలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనార్టీలకు రూ, లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పేద మైనారిటీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకంపై నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ మైనార్టీలకు రూ.లక్ష.. మార్గదర్శకాలు ఇవే

# పనిముట్లు, ముడి సరుకు కొనుగోలుకే ఆర్థిక సాయం
# 21 నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులు
# వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలు మించరాదు
# కుటుంబంలో ఒక్కరికే వర్తింపు
# https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ
# కలెక్టర్ల నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక…ఆ జాబితా జిల్లా మంత్రుల ఆమోదం పొందాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version