ఈవారం థియేటర్/ ఓటీటీ లలో అలరించబోయే చిత్రాలు ఇవే.!

-

గత రెండు మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలే థియేటర్లలో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ తెలుగులో విడుదల అవుతుండడంతో ఒకే ఒక్క చిన్న సినిమా మినహా మరే చిత్రం కూడా విడుదల కావడం లేదు.. ఇకపోతే ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్ మరియు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

బ్రో (ది అవతార్) :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలు పోషిస్తూ నటిస్తున్న చిత్రం బ్రో. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం అందుకున్న వినోదయ సీతం సినిమాను రీమేక్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాలం అవతారంలో సరికొత్త పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

స్లమ్ డాగ్ హస్బెండ్:
నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం స్లం డాగ్ హస్బెండ్.. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ , సప్తగిరి కీలకపాత్రను పోషిస్తున్నారు. ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వంలో మైక్ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ:
అలియా భట్ , రణవీర్ సింగ్ జంటగా వస్తున్న ఈ చిత్రం జూలై 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీల విషయానికి వస్తే..
నెట్ఫ్లిక్స్
డ్రీమ్ (కొరియన్ మూవీ ) జూలై 25
మామన్నన్ (తెలుగు/తమిళ్) జూలై 27.. స్ట్రీమింగ్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version