మోటో జీ సిరీస్ లో భాగంగా.. మోటో జీ 71 ఎస్ 5 జీ స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల చేశారు. 20 వేల లోపే దీని ధర ఉంది. ఫీచర్స్ కూడా సాధారణ కస్టమర్స్ ను ఆకర్షించేలానే ఉన్నాయి. చైనాలో విడుదలైన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..!
Moto G71s 5G ధర..
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా అంటే.. సుమారు రూ.19,500గా నిర్ణయించారు. స్టార్ బ్లాక్, హవోయూయే కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మోటో జీ71ఎస్ 5జీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తారో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
మోటో జీ71ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను మోటో జీ71ఎస్ 5జీలో అందించారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.
కెమేరా క్వాలిటీ..
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
మొత్తానికి మోటో తనదైన శైలిలో.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను తెచ్చింది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే.. కష్టమర్స్ ను యట్రాక్ చేస్తుందనే టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.