మారుతీ సుజుకీ సూపర్ కారుని ఒకటి విడుదల చేయడం జరిగింది. అదనపు ఫీచర్లలో మూడు రంగుల్లో తీసుకు రావడం జరిగింది. మరి ఈ కొత్త స్విఫ్ట కారు ఫీచర్లు, ధర వివరాల లోకి వెళితే… మారుతీ సుజుకి 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇండియా లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కారుకు కొన్ని అప్‌గ్రేడ్ల తో తీసుకు వచ్చిన మోడల్ ఇది. లుక్ నుండి భద్రత వరకు కొన్ని మార్పులు చేసారు. ఆటోమెటిక్ గేర్ షిఫ్ట్ సౌకర్యంతోనూ ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కార్ ప్రత్యేకతలు ఏమిటంటే…? స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ దీనిలో ఉంది. అలానే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్లే, మూడు రకాల డ్యుయల్ టోన్ రంగులు, అదనపు శక్తితో కొత్త కె-సిరీస్ ఇంజిన్ మరియు క్రుసీ కంట్రోల్ మొదలైన ఫీచ్చర్స్ దీనిలో ఉన్నాయి. పర్ట్ ఆర్కిటిక్ వైట్ (పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్), సాలిడ్ ఫైర్ రెడ్ (పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్), పర్ల్ మెటాలిక్ మిడ్‌నైట్ బ్లూ (పర్ల్ ఆర్కిటిక్ వైట్ రూఫ్) రంగుల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ కారు ప్రారంభ ధరను రూ.5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. అలానే టాప్ ఎండ్ మోడల్ రూ.7.9 లక్షల వరకు ఉంది. లీటర్‌కు 23.20 కి.మీ. మైలేజ్ ఇస్తుంది అని కంపెనీ తెలిపింది. కొత్త మోడల్‌లో వాడిన ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీ తో ఇంజిన్ సామర్థ్యం కూడా పెరగనుందని కంపెనీ తెలిపింది.