టూవీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్…!

-

టూవీలర్ ని కనుగోలు చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసం. తాజాగా
అదిరిపోయే స్కూటర్ ఇప్పుడు అందుబాటు లో ఉంది. మరి దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఈ స్కూటర్ ని కనుక మీరు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. అలానే డ్రైవింగ్ లైసెన్స్ లేక పోయినా నడపొచ్చు. తాజాగా మార్కెట్‌ లోకి వచ్చిన ఈ కొత్త స్కూటర్ వివరాలల్లోకి వెళితే… ఒడిస్సీ అనే దేశీ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ తాజాగా కొత్త స్కూటర్ తీసుకు వచ్చింది.

దీని పేరు ఈ2గో ఈవీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేస్తే ఎన్నో బెనిఫిట్స్ కూడా మీకు లభిస్తాయి. ఈ స్కూటర్‌కు మోటార్ వెహికల్స్ చట్టం కూడా వర్తించదు. ఈ సూటర్ లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.52,999గా, రూ.63,999గా ఉంది. యువత, మహిళలు లక్ష్యంగా ఈ సూటర్ లని తయారు చేయడానికి కారణం అని కంపెనీ తెలిపింది.

ఇది ఇలా ఉండగా ఒడిస్సీ స్కూటర్లు గరిష్టంగా గంటకు 25 కిలో మీటర్లు వెళ్తుంది. అలానే ఒక్కసారి కనుక చార్జింగ్ పెట్టుకుంటే 60 కిలో మీటర్ల వరకు వీటి మీద వెళ్లొచ్చు. ఇంకా బ్యాటరీ ఫుల్ కావడానికి అయితే 3 నుంచి 4 గంటల టైమ్ పడుతుంది. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ఈ స్కూటర్ తిప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version