వ‌న్‌ప్ల‌స్ యానివ‌ర్సరీ సేల్‌.. ఫోన్లు, ప్రొడ‌క్ట్స్ పై ఆఫ‌ర్లు, త‌గ్గింపు ధ‌ర‌లు..

-

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ భార‌త్‌లో త‌న తొలి స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసి 7 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ క్ర‌మంలో ఆ సంస్థ ఎన్నో ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇక ప్రీమియం స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో వ‌న్‌ప్ల‌స్ దేశంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతుంద‌ని కౌంట‌ర్ పాయింట్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక‌లో వెల్ల‌డైంది. కాగా వార్షికోత్స‌వం సంద‌ర్భంగా వ‌న్‌ప్ల‌స్ ఈసారి కూడా అనేక ఆఫ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

వ‌న్‌ప్ల‌స్‌కు చెందిన ఫోన్లు, ఇత‌ర ప్రొడ‌క్ట్స్ ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ.2వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అదే అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ కార్డుల‌తో అయితే 10 శాతం క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. వ‌న్ ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ స్టోర్ యాప్‌ల‌లో కొనుగోలు చేస్తే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

వ‌న్‌ప్ల‌స్ స్టోర్ యాప్‌లో వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ల‌ను కొంటే రూ.500 కాంప్లిమెంట‌రీ డిస్కౌంట్ ఓచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. డిసెంబ‌ర్ 17 నుంచి వ‌న్‌ప్ల‌స్ ప‌వ‌ర్ బ్యాంక్‌ను రూ.777కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా వ‌న్‌ప్ల‌స్ ఆడియో ప్రొడ‌క్ట్స్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ స్టోర్ యాప్ లో డిసెంబ‌ర్ 17న క‌స్ట‌మ‌ర్లు వీల్‌ను స్పిన్ చేసి ఎగ్జ‌యిటింగ్ వ‌న్‌ప్ల‌స్ గిఫ్ట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే వ‌న్‌ప్ల‌స్ నిర్వ‌హించే గ్రేట్ ల‌క్కీ డిప్‌లో పాల్గొన‌వ‌చ్చు. ఇక కేవ‌లం రూ.999కే వ‌న్‌ప్ల‌స్ రెడ్ కేబుల్ లైఫ్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే 12 నెల‌ల వ‌ర‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీ, 12 నెల‌ల వ‌ర‌కు 50 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌, ప్రియారిటీ స‌ర్వీస్‌, 12 నెల‌ల వాలిడిటీ గ‌ల ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇవే కాకుండా మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను వ‌న్‌ప్ల‌స్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా అందిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version