మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎ11కె పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సల్ కెమెరాను, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ స్లాట్లను ఏర్పాటు చేశారు. 4230 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు.
ఒప్పో ఎ11కె స్పెసిఫికేషన్లు…
* 6.22 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీడియో పి35 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 13, 2 మెగాపిక్సల్ బ్యాక్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ
ఒప్పో ఎ11కె స్మార్ట్‌ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.8,990 ధరకు ఈఫోన్ వినియోగదారులకు త్వరలో అమెజాన్‌లో లభ్యం కానుంది.