కరోనా లాక్‌డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమవుతున్న జనాలు ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం పబ్‌జి మొబైల్, లూడో వంటి గేమ్స్‌తోపాటు గేమింగ్ ప్రియులను మరో గేమ్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. అదే.. స్లాప్ కింగ్స్ (SLAP KINGS) గేమ్.. ఇందులో ప్రత్యర్థిని చెంప దెబ్బలు కొట్టి ఓడించాల్సి ఉంటుంది.
స్లాప్ కింగ్స్ గేమ్‌లో యూజర్ తన ఎదురుగా ఉండే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లేయర్‌ను బలంగా చెంప దెబ్బ కొట్టాల్సి ఉంటుంది. యూజర్‌కు ఎదురుగా ఓ పవర్ మీటర్ ఉంటుంది. అందులో మీటర్ అటు, ఇటు తిరుగుతుంటుంది. అందులో గ్రీన్ జోన్‌లో మీటర్ ఉన్నప్పుడు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీటర్ గ్రీన్ జోన్‌లోకి వచ్చినప్పుడు ప్లేయర్‌ను ప్రెస్ చేస్తే.. దానికి తగ్గ పవర్‌తో ఏఐ ప్లేయర్‌ను చెంప దెబ్బ కొడతాడు. ఆ మేర ఏఐ ప్లేయర్ హెల్త్ పోతుంది. తరువాత ఏఐ ప్లేయర్ యూజర్ ప్లేయర్‌ను చెంప దెబ్బ కొడతాడు. ఇలా గేమ్ సాగుతుంది. ఈ క్రమంలో మొదటగా ఎవరి హెల్త్ అయిపోతే వారు ఓడిపోయినట్లు లెక్క.
ఇక ఈ గేమ్‌లో హెల్త్, స్లాప్ పవర్‌ను పెంచుకునేందుకు కాయిన్స్‌ను ఖర్చు చేయాలి. సాధారణంగా గేమ్ విన్ అయినప్పుడు లేదా యాప్‌లో ఇచ్చిన యాడ్ వీడియోలను చూస్తే.. యూజర్ కాయిన్స్ పొందవచ్చు. వాటితో ప్లేయర్ హెల్త్, స్లాప్ పవర్‌ను పెంచుకోవచ్చు. ఇక ఈ గేమ్ పలు లెవల్స్‌లో కొనసాగుతుంది. లెవల్ పెరిగినకొద్దీ ఏఐ ప్లేయర్ హెల్త్, పవర్ పెరుగుతాయి. కనుక అందుకు తగినట్టుగా యూజర్ తన ప్లేయర్ హెల్త్, స్లాప్ పవర్‌ను కాయిన్స్ ఉపయోగించి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై గేమింగ్ ప్రియులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆయా యాప్ స్టోర్‌లలో ఈ గేమ్‌ను యూజర్లు పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. మరి.. మీరు కూడా బలంగా చెంప దెబ్బ కొట్టాలనుకుంటే.. ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆడండి మరి.. దీని సైజ్ దాదాపుగా 100 ఎంబీ వరకు ఉంది..!