30 వేల కంటే తక్కువ ధరకే 55 ఇంచ్ బ్రాండెడ్ 4K HDR స్మార్ట్ టీవీ….!

-

మీరు మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అది కూడా 30 వేల రూపాయల లోపే కొనాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ మీరు ఈ స్మార్ట్ టీవీ గురించి చూడాల్సిందే. 55 ఇంచ్ సైజులో పెద్ద స్మార్ట్ టీవీని కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనుగోలు చేసే అవకాశం వుంది. మరి పూర్తి వివరాల లోకి వెళితే..

 

వెస్టింగ్ హౌస్ ఇటీవల ఇండియా లో ప్రకటించిన 55 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి డిస్కౌంట్ లో పొందొచ్చు. ఈ బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 33% భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరకే అమెజాన్ నుండి కొనుగోలు చేసుకోచ్చు. Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనే వారికి 1750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా వుంది. ఇక ఫీచర్స్ వంటి వాటిని చూస్తే..

ఈ వెస్టింగ్ హౌస్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ కలిగి వుంది. అలానే ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కలిగిన ప్యానెల్స్ తో ఈ టీవీ వస్తుంది.

ఇక కనెక్టివిటీ ఫీచర్స్ విషయం లోకి వస్తే.. 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది. సౌండ్ ఎలా వుంది అనేది చూస్తే.. 40W హెవీ సౌండ్ తో ఈ టీవీ రానుంది. సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో కలిగి వుంది ఇది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news