గుప్పెడంతమనసు సెప్టెంబర్ 25 ఎపిసోడ్-252: రషీ-వసూల మధ్య మొదలైన రొమాంటిక్ యాంగిల్..ఇగో మాష్టర్ ఇలా చేశాడా..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ జగతి మేడమ్ మిమ్మల్ని, మహేంద్ర సార్ ని దూరం చేయాలనుకోవటం లేదు. అలా చేయాలి అనుకుంటే ఈ 20 ఏళ్లు దూరంగా ఉండేవాళ్లు కాదు అంటుంది. మరి ఎందుకు వచ్చినట్లు అని రిషీ అడుగుతాడు. మేడమ్ రాలేదు, మహేంద్ర సార్ తీసుకొచ్చారు అంటుంది, మీరు మేడమ్ మీద అభిప్రాయాన్ని మార్చుకోవాలి సార్ అంటుంది. రిషీ కోపంగా..ఎందుకు మార్చుకోవాలి అని అడుగుతాడు. వసూ 20ఏళ్లుగా అందరికి దూరమై, ఒంటరిగా ఉన్నారు సార్ మేడమ్ అంటుంది. రిషీ..వేరీ గుడ్, అదే 20ఏళ్లు నేను చాలా కోల్పోయాను కదా,మరి దాని గురించి ఆలోచించవేంటి, ఇదే అంశాన్ని నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు, శిక్ష నాకుపడింది, నేను బాల్యాన్ని కోల్పోయాను, నువ్వు చూసే ఆలోచనా ధోరణి కరెక్ట్ కాదు వసుధార, నన్ను మారమని, నా ఆలోచనలు మార్చుకోమని అంటున్నావు, మారాల్సింది నువ్వు అంటాడు.

వసూ మీ బాధలో నిజముంది. కాని జగతి మేడమ్ ని అంతలా ద్వేషిస్తూ ఏం బాగుంది సార్ అంటుంది. రిషీ ఒక ఫ్యాకెల్టీ హెడ్ గా నేను జగతి మేడమ్ ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అని జరిగిన గొడవ( మహేంద్ర సీరియస్ అయిన సీన్) గురించి చెప్తాడు. వసూ మైండ్ లో ఫైల్ విసిరినదానికికారణం దేవయాని మేడమ్ కాదనమాట అనుకుని కొటేషన్స్ చెప్తుంది. రిషీ కోపంతో నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం తగ్గించుకుంటే మంచింది అని వెళ్దామా అంటాడు. వెళ్లి కారులో కుర్చుంటాడు. రిషీ సార్ మనసు మారదా అనుకుని వసూ కూడా కారు ఎక్కుతుంది. రిషీ డాడ్ కాలేజ్ గెస్ట్ హోస్ లో ఉన్నారు, ఇప్పుడే ఇంటికి వెళ్లారు అని చెప్తాడు.

ఇంకోవైపు మహేంద్ర రెండు రోజులుగా జరిగిన గొడవను తలుచుకుంటూ ఉంటాడు. ధరణి వస్తుంది. మీకు చెప్పేంతదానిని కాదు, ఇంకోసారి ఇలా చేయకండి..మేమంతా చాలా బాధపడ్డాము అని ..ఇంట్లో మీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, అన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోను..కాని కొన్ని చెప్పక తప్పదు అనపించింది అంటుంది. మహేంద్ర ఏంటమ్మా అది అని అడుగుతాడు. వసుధార రిషీ కోసం ఇంటికొచ్చినప్పుడు అంటూ సాగిదీస్తుంది. ఏం జరిగిందమ్మా అని మహేంద్ర అడుగుతాడు. ధరణి..దేవయాని వసుధారపై విరుచుకుపడిన సీన్ చెప్తుంది. వసుధార నాకెందుకు చెప్పలేదు అనుకుంటాడు మహేంద్ర. అన్నీ చెప్పి, మిమ్మల్ని రిషీని ఇబ్బంది పెట్టొద్దు అనుకుందేమో ,అటు జగతి అత్తయ్యకి, రిషీ వసుధారకు అనుసంధానం చేసేది మీరే కదా.. మీరు కొంచెం బ్యాలెన్స్ డ్ గా ఉండాలి అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంది. రిషీ మనసు అద్దం లాంటిది తను ఏమాత్రం డిస్టబ్ అయినా మనమే బాధపడాలి అంటుంది. మహేంద్ర వదిన తిట్టేప్పుడు వసుధార కామ్ గా ఉందా అని అడుగుతాడు. లేదు తనకూడూ ధైర్యంగా సమాధానం ఇచ్చిందిని చెప్పి వెళ్లిపోతుంది. మహేంద్ర.. ధరణి చెప్పింది నిజమే అనుకుని ఆలోచిస్తాడు.

ఇంకోవైపు కారులో వెళ్తున్న వసూ.. రిషీ అన్న మాటలను గుర్తుచేసుకుంటూ..జగతి మేడమ్ కి మేసేజ్ చేయబోతుంది. రిషీ ఏం చేస్తున్నాం అని అడుగుతాడు. వసూ నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసు, మళ్లీ నా నోటితో చెప్పించాలనుకుంటున్నారా అని అడగుతుంది. రిషీ..మీ మేడమ్ కి ఈపాటికే తెలుస్తుంది. అని ఇద్దరు వాదించుకుంటారు. వసుధారకు కొటేషన్స్ చెప్తాడు. వసూ మనసులో ఈ జెంటిల్ మెన్ కొత్తగా కొటేషన్స్ చెప్తున్నారేంటో, అమ్మను ప్రేమించే కొడుకుగా మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను సర్ అనుకుంటుంది.

ఆరోజు రాత్రి జగతి రిషీ అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర వాయిస్ మెసేజ్ పంపుతాడు. చెప్పకుండా వెళ్లినందుకు సారీ చెప్తాడు. ఆ మెసేజ్ విని జగతి కంటతడి పెట్టుకుంటుంది. ఇంతలో వసూ వస్తుంది. మహేంద్ర సార్ మాట్లాడారా మేడమ్ అని అడుగుతుంది. మెసేజ్ చేశారు అని రిషీ ఏమంటున్నాడు అని అడుగుతుంది. వసూ పొద్దున జరిగింది ఆలోచిస్తూ ఉంటుంది. అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి అని జగతి అంటుంది. ఆలోచిస్తున్నాను, వసూ బాధగా అమ్మ ప్రేమ ఒకవైపు, ద్వేషం మరొకవైపు..ఈ రెండింటిని ఒకేసారి చూస్తుంటే ఏం సమాధానం చెప్పగలను మేడమ్ అంటుంది. ఒకరికొకరు అలా బాధగా మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజు ద్వేషం ముందు మీ ప్రేమ గెలుస్తుంది మేడమ్ అని గుడ్ నైట్ చెప్పి వెళ్లబోతుంది. జగతి మాత్రం ఆ మాటలకు కాంప్రమైజ్ కాదు..కొండకరగదు రిషీ ద్వేషంలా అని చెప్తుంది.

మరుసటి రోజు ఉదయం దేవయాని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మహేంద్ర చూసి..ధరణి అన్న మాటలను తలుచుకుని వదినా అని పిలుస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో వసూ చేతిలో లాప్ టాప్, ఫైల్స్, బ్యాగ్ అని ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. రిషీ కారులో అలా కుర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోకునే వీలుకాక అలానే ఉంటుంది. రిషీయే స్వయంగా వసూకి సీట్ బెల్ట్ పెడతాడు. ఈ సీన్ లో వసూ రిషీని అంత దగ్గరగా చూసి కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. మరి ఇగో మాష్టర్ కూడా అలానే ఫీల్ ఐ మురిసిపోతాడేమా సోమవారం ఎపిసోడ్ లో చూద్దాం.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version