గుప్పెడంతమనసు ఎపిసోడ్ 332: రిషీయే నిన్ను ఇంట్లోంచి పంపించేయమన్నాడని వసూతో చెప్పేసిన జగతి

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బిహేవియర్ లో వచ్చిన మార్పులు మహేంద్రకు చెప్తుంది. అవసరం లేకపోయినా చికాకు పడుతున్నారని అంటుంది వసుధార. ఇంట్లో కూర్చుని జగతి ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర కాల్ చేస్తాడు. మహేంద్ర ఎలా ఉన్నావ్ అంటే..పొద్దున్న నుంచి కలిసే ఉన్నాం కదా మళ్లీ ఎలా ఉన్నావ్ అని అడుగుతావేంటే..చికాకు పడుతుంది. ఓసారి రెస్టారెంట్ దగ్గర కలుద్దాం అని మహేంద్ర అడుగుతాడు..నాకు తలనొప్పిగా ఉందని..జగతి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటమ్మా మీ మేడమ్.. మాట్లాడుతుంటూనే కట్ చేసేసిందని వసుతో చెబుతాడు మహేంద్ర. సరే నేను చూసుకుంటా నువ్వు డ్యూటీకి వెళ్లు అని వసు పంపించేస్తాడు. జగతి డిస్ట్రబ్ అయితే వసుని ఎందుకు ఇబ్బంది పెడుతుంది తెలుసుకోవాల్సిందే..అనుకుంటాడు.

రిషీ- ధరణీ

మరోవైపు రిషి రూమ్ లో బట్టలు సర్దుతుంటుంది ధరణి. ఏంటి వదినా ఇవన్నీ మీరు చేయాలా అంటాడు రిషీ.. నీకు ఏమైనా కావాలా అని అడిగితే వద్దు వదినా అంటాడు. గౌతమ్ ఎక్కడికి వెళ్లాడని అడిగితే.. నీ దగ్గరకే వస్తాన్నాడు కదా అని ధరణీ అంటుంది. నీకేమైనా కావాలంటే అడుగు అనేసి ధరణి అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఇంతలో గౌతమ్ వేసిన బొమ్మ ఏంటా అని చూద్దామనుకుని వెళ్తాడు. మొత్తం పూర్తయ్యాక చూద్దాం అనుకుంటాడు.

జగతి ఇంట్లో మహేంద్ర

జగతి ఇంటికి వెళ్లిన మహేంద్ర.. ఏంటి జగతి మాట్లాడవేంటి, వచ్చి ఇంత సేపు అయింది..ఏం అడిగినా సమాధానం చెప్పడం లేదంటాడు. నేను తలనొప్పిగా ఉందని చెప్పినా వచ్చావ్.. పదే పదే అడుగుతున్నావ్ ఏమవుతుందని అంటుంది జగతి.. మహేంద్ర.. నిన్ను ఏదో.. విసిగించాలని కాదు జగతి నువ్వు డల్ గా మాట్లాడేసరికి ఏం జరిగిందో అని వచ్చానంటాడు. జగతి.. నేను బాగానే ఉన్నాను..నన్నెవరూ ఏమీ అనలేదంటుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని నేను అడగలేదుగా జగతి అని మహేంద్ర అంటాడు. వర్క్ లోడ్ ఎక్కువైంది..అందుకే ఈ తలనొప్పి అంటుంది జగతి. కాఫీ కలపనా, బయటకు వెళదామా, కాసేపు నడిచేసి వద్దామా అని అడిగినా..జగతి వద్దు అంటుంది. నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే..నాకు చెప్తే అని మహేంద్ర అంటాడు..జగతి ఏం లేదు అంటుంది. మహేంద్ర పక్కన కుర్చోని ప్రేమగా బుజ్జగిస్తాడు. జగతి అయినా..నేను బాగానే ఉన్నాను అంటుంది. ఏదో జరిగింది నువ్వు చెప్పడం లేదు నేనే తెలుసుకుంటానని మనసులో అనుకుంటాడు మహేంద్ర

రెస్టారెంట్ లో గౌతమ్ విత్ వసుధార

రెస్టారెంట్లో వసుధారని చూసి..ఏంటో దేవుడు విచిత్రాలు.. ఏంజెల్ రెస్టారెంట్లో కనిపిస్తోంది అనుకుంటాడు గౌతమ్. ఆర్డర్ ప్లీజ్ అని ఓ అమ్మాయి వచ్చి అడగడంతో వెన్నెల వర్షం కప్ ప్లీజ్ అనేసి..సారీ.. కాఫీ ప్లీజ్ అంటాడు. వసు బిజీగా ఉంటుంది.గౌతమ్ ని అసలు పట్టించుకోదు..మనోడు కాఫీల మీద కాఫీ తాగేస్తాడు. ఎట్టకేలకు వసుధార గమనించలేదని మనోడే పిలుస్తాడు. సర్ ఎప్పుడొచ్చారని అడుగుతుంది వసుధార. పూర్వజన్మలో..ఇదిగో ఈ కాఫీలన్నీ నేను తాగినవే నువ్వు వస్తావని చూస్తున్నా అంటాడు. వసుధార ఇది నా టేబుల్ కాదు సార్ అంటుంది. అవునా.. నీ టేబుల్ ఎక్కడ అని అడిగి కూర్చుంటాడు. కాఫీ తాగేశారు కదా ఇంకేం తాగుతారని అంటే.. ఇప్పుడు నువ్విచ్చే కాఫీ స్పెషల్ అంటాడు.

మరోపక్క…ఇంట్లో కూర్చున్న ఈగో మాస్టర్ రిషి..వసు జ్ఞాపకాల్లో మునిగితేలుతుంటాడు. రెస్టారెంట్లో వసు తెచ్చిన కాఫీతో సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెడతాడు. అది కాస్తా..రిషీ చూసి..దెబ్బకి బిడ్డ షాక్ అవుతాడు..వీడు ఎక్కడ ఉన్నాడు అని..కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అని రిషీ అంటే..గౌతమ్ ఏదేదో చెప్తాడు. రెస్టారెంట్ లో కదా అంటే అంటాడు రిషీ. గౌతమ్ వీడికి ఎలా తెలిసింది అనుకుని ఏదో చెప్పి కవర్ చేద్దాం అనుకుంటాడు. రిషీ కట్ చేసి..జెట్ స్పీడ్ లో బయలుదేరతాడు.

దేవయాని- ధరణి

దేవయాని రూమ్ కి వెళ్లి ధరణి పాలు ఇస్తుంది… నీకు నాపై కోపం వస్తుందా అని అడుగుతుంది దేవయాని… నాకెందుకు కోపం వస్తుంది అని ధరణి అనటంతో.. నాకు నీపై వస్తోంది..రిషి-వసుధార మధ్యలో జరిగేవి నాకు చెప్పడం లేదు, ఎన్నిసార్లు అడిగినా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఊరుకుంటావ్ అంటుంది.. దేవయాని. ఇందాక కార్ సౌండ్ వినిపించింది రిషేదేనా అంటే..రిషి బయటకు వెళ్లాడని చెబుతుంది ధరణి. ఎక్కడకు వెళ్లాడో అడిగివా అంటే.. వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఆగా అంటుంది ధరణి.ధరణిని పంపించి..ఇంత రాత్రిపూట రిషీ ఎక్కడికి వెళ్లినట్టు అనే ఆలోచనలో పడుతుంది దేవయాని.

గౌతమ్ నాకు చెప్పకుండా వెళ్లాడనుకుంటూ రిషి కారేసుకుని బయలుదేరుతాడు. అటు రెస్టారెంట్లో వసుధార బయలుదేరుతుంటే నీకోసం ఇప్పటి వరకూ వెయిట్ చేశా అంటాడు గౌతమ్. నా కోసం వెయిట్ చేయడం ఏంటి సార్ అంటుంది వసూ..ఏదో మాట్లాడాలి అనుకున్నాను, ఏదో చెప్పాలి అనుకున్నా అంటాడు.. ఇంటికే కదా వెళ్లేది..క్యాబ్ బుక్ చేస్తా అంటాడు. నేను ఆటోలో వెళతా అంటే నేను కూడా ఆటోలో వస్తా అంటూ ఆటో గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటాడు గౌతమ్. నేను జోక్ చేశా నువ్వురాలేదా అంటే.. జోక్ అనుకులేదు సార్ అంటుంది. నేను వెళతా అని వసు అంటే నేను వస్తా అంటాడు గౌతమ్…ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి నేనుకూడా వస్తా అంటాడు. రిషీని చూసిన

రేపటి ఎపిసోడ్ లో

మేడం మీతో ఓ మాట మాట్లాడాలి అంటుంది వసుధార. నేను ఏం తప్పు చేశానని అడిగితే నువ్వు ఇంట్లోంచి హాస్టల్ కి వెళ్లిపో…రిషీ నిన్నుపంపించమన్నాడు అంటుంది జగతి .. అయితే రిషి సర్ తోనే తేల్చుకుంటా అంటుంది వసుధార. మరో సీన్ లో రిషీ వసుధార ఓ దగ్గర కుర్చుంటారు. అయితే రిషి తాను చెప్పినట్టు చెప్పొద్దన్నాడుగా.. కాబట్టి ఇది జగతి ఊహ అయిండొచ్చు. ఏం జరుగుతుందో బుధవారం ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version