కేంద్రం కీలక నిర్ణయం… కోవోవాక్స్, కార్బెవాక్స్ టీకాలకు అత్యవసర అనుమతి

-

కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి మరో ముందడుగు వేసింది. కరోనా నియంత్రణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కోవిడ్ -19 వ్యాక్సిన్లు అయిన ’’కోవోవాక్స్ & కార్బెవాక్స్‘‘ ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈరెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులను జారీ చేసింది. దీంతో పాటు యాంటీ వైరల్ డ్రగ్ ’’మోల్నుపిరావిర్‌‘‘లకు అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చిందని ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీంతో కరోనాపై మరింత సమర్థవంతంగా ఇండియా పోరాడనుంది.

దేశంలో కరోనా తీవ్రత… ముఖ్యంగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలను, హెచ్చరికలను జారీ చేసింది. ఓమిక్రాన్, కోవిడ్ కేసులపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచింది. దీంతో పాటు నైట్ కర్ఫ్యూలను విధించాలని సూచించింది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని ఆదేశించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version