కార్తీకదీపం ఎపిసోడ్ 1166: దీప ఇంట్లోకి ప్రియమణి ఎంట్రీ..మోనిత ప్లాన్ లో భాగమే అని తెలుసుకోలేకపోయిన కార్తీక్ కుటుంబం

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. రోషిణి మేడమ్ ని కలవాలి, మోనితకు శిక్షపడాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి ఒక కారు అడ్డదిడ్డంగా వస్తుంది. ట్విస్ట్ అదిరిపోయింది. సరిగ్గా కారు వచ్చి గుద్దేలోపు మన ప్రియమణి వచ్చి దీపను పక్కకు లాగుతుంది. (ప్రియమణి మోనిత పనిమనిషి) ప్రియమణి గెటప్ అప్ ఇప్పుడు అచ్చం పనిమిషిలా ఉంది. ఒకప్పుడు మోనిత ఇంట్లో ఎంత అందంగా ఉండేది. మీకు ఏం కాలేదు బానే ఉన్నారమ్మా అంటూ..ప్రియమణి మోనితను తిడుతుంది. చేసిన పాపం పండిందిగా..ఉరిశిక్ష పడాల్సింది అంటుంది. దీప ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నా మీద కోపం పోలేదా, దేవతాలాంటి మిమల్ని చాలా మాటాలు అన్నాను అని..తన కాళ్లుపట్టుకుని క్షమించమ్మా అంటుంది. దీప వదులు అంటుంది. సరే ప్రియమణి ఇక ఆ గొడవ వదిలేయ్ అంటుంది. మీరు బాగుండాలి కార్తీకయ్యా, పిల్లలు బాగుండాలి అంటుంది. వెళ్లిపోతూ..200 ఉంటే ఇస్తావా అమ్మా, కడుపునిండా తిని చాలారోజులయ్యింది, ఎ‌వరూ పని ఇవ్వమనన్నారు అమ్మా అంటూ సెంటిమెంట్ కురిపిస్తుంది. ప్రియమణి ఏం మారలేదు..ఆ మోనిత వేసిన ప్లాన్ ఏ ఇది. ఈ విషయం తెలియని దీప ఆ ప్రియమణి మాటలను గొర్రెలా నమ్ముతుంది. ప్రియమణి మీ ఇంట్లో పనిచేస్తాను అమ్మా, డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు…మూడుపూట్లా అన్నంపెట్టండి చాలు అంటుంది. దీప నాకు ఓకే..మా అత్తయ్య గారు ఒప్పుకుంటేనే అంటుంది.

ఇంకోసీన్ లో హిమ, శౌర్య కార్తీక్ బర్డే గురించి మాట్లాడుకుంటారు. ఒకప్పుడు హిమ కార్తీక్ బర్డే ఎలా సెలబ్రేట్ చేసిందో చెప్తుంది. శౌర్య..హిమ కోపం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. డాడీ అంటే నీకు ఇష్టం కదా, ప్రతిసారి విషెస్ చెప్తావ్ కదా.. డాడీ అంటే ఎంత కోపం ఉన్నా మళ్లీ వన్ ఇయర్ వరకూ బర్డే రాదుకదా అంటుంది. ఆ మాటకు హిమ ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. రూంలో కార్తీక్ పడుకుంటే హిమ వచ్చి హ్యాపీబర్డే విషెస్ చెప్పినట్లు కార్తీక్ కలగంటాడు. లేచి హిమరాలేదా, వస్తుందిలే ఇంకా నిద్రలేవలేదేమో అనుకుంటాడు. శౌర్య హిమను బలవంతం చేస్తుంది…వెళ్లి విషెస్ చెప్పాలని అంటుంది. హిమ నేను రానంటుంది. పాపం శౌర్య మనసులో నాన్న బర్డే ఇప్పటివరకూ నేను చూడలేదు..ఇప్పుడు చెప్దాం అంటే హిమ ఫీల్ అవుతుందేమో అనుకుంటుంది.

కార్తీక్ వచ్చి పిల్లల్ని పలకరిస్తాడు..ఈరోజు నాన్న హ్యాపీబర్డే కదా మర్చిపోయారా అనుకుంటూ పిల్లల దగ్గరకి వెళ్తాడు. హిమ లేచి వెళ్లిపోతుంది. కార్తీక్ దిగాలుగా చూస్తాడు. శౌర్య విషెస్ చెప్తుంది కానీ.. కార్తీక్ కి అంత సంతోషం ఉండదు. కట్ చేస్తే రెడీ అయి కిందకు వస్తాడు. కింద సౌందర్య, ఆనంద్ రావు, ఆదిత్య, శ్రావ్యలు రెడీగా ఉంటారు.అందరూ బర్డే విషెస్ చెప్తారు. మనోడికి సంతోషం ఉండదు. పుట్టినరోజు నాడుకూడా ఇలా ఉన్నావేంట్రా అంటుంది సౌందర్య. పుట్టినరోజు అన్న ఆనందం నాకెక్కడ ఉంది మమ్మీ, హిమ నాతో మాట్లాడటం లేదు, బర్డే విషెస్ కూడా చెప్పలేదు అంటాడు. సౌందర్య వాళ్లేదో అలిగారు, కాసేపు అయితే వాళ్లే మాట్లాడుతారులే అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా దీప గుడి నుంచి వస్తుంది. వెనకే ప్రియమణి వస్తుంది.

కార్తీక్ ప్రియమనణిని చూడగానే నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావ్, వెళ్లు అవతలికి అంటాడు..దీప తను కనిపించడంలేదా మెడపట్టి బయటకుగెట్టేయ్ అంటే..డాక్టర్ బాబు తనని నేనే తీసుకొచ్చాను పూటగటవడంలేదంటే పాపం అని తీసుకొచ్చాను అంటుంది. ఇలాంటి వారిమీద నీ మానవత్వం.. ఇంటిదాగరానివ్వటం ఏంటి, మమ్మీ పంపించేయ్ మను, తనని చూస్తుంటే నాకు తేళ్లు, పాములు వంటిమీద పాకుతున్నంత కంపరంవేస్తుంది అంటాడు. ప్రియమణి వెళ్లి సౌందర్య కాళ్లుపట్టుకుని…నన్ను క్షమించండి అమ్మా, తినటానికే కష్టమవుతుందమ్మా అంటూ సీన్ రక్తికట్టిస్తుంది. కార్తీక్ మమ్మీ ఈ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు అంటాడు. ప్రియమణి నాటకానికి సౌందర్య కూడా కరిగిపోతుంది, కార్తీక్ ను ఒప్పిస్తుంది. కానీ కార్తీక్ ఏం మాట్లాడడు..ఫోన్ వస్తే పైకి వెళ్లిపోతాడు. సరెసరే నువ్వు లోపలికి వెళ్లు బుద్దిగా ఉండాలి అని ప్రియమణికి చెప్తుంది. అసలు తిండికి ఇబ్బంది అంటే..వీళ్లకు బుర్రలేదా..డబ్బులిచ్చి పంపించొచ్చుగా ఏంటో.

జైల్లో మోనితకు సుకన్య వచ్చి మీరు చెప్పినట్లే చేసింది అంట మేడమ్ అని చెప్తుంది. ఈ సంతోషంలో నాకు గప్పెడు యాపిల్స్ కావాలి తెచ్చిపెడతావా అంటుంది. సరే అమ్మా అంటుంది సుకన్య. మోనిత నిన్న చెప్పిన లైవ్ టెలికాస్ట్ ఈ ప్రియమణే. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో హిమ ఆసుపత్రికి వచ్చిందని దీప చెప్తుంది. కార్తీక్ కి డౌట్ వస్తుంది..మోనిత మాటలను వినిందా అని.హిమతో వెళ్లిపక్కను కుర్చుని డాడీమీద ఎందుకు అంత కోపం అంటూ హిమను పట్టుకుంటాడు. హీమ కోపంగా లేచి నన్ను ముట్టుకోవద్దు డాడీ అని అరుస్తుంది. మరన్ని వివరాలు సోమవారం చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version