మీరు పొదుపు పథకంలో 10 లక్షల కంటే ఎక్కువ పెడుతున్నారా? కొత్త రూల్స్ ఇవే..

-

ప్రతి ఒక్కరు కూడా పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంటారు.. భవిష్యత్ అవసరాల కోసం చాలా మంది పొదుపు చేస్తున్నారు..ప్రభుత్వ శాఖల్లో ఒకటైన పోస్టాఫీసు పొదుపు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు.. ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను అందుకోవడంతో ఎక్కువ మండి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..అయితే కొన్ని కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పూర్తిగా మార్చివేసింది..

అవేంటంటే..పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడులను తక్కువ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని మూడు వర్గాలుగా విభజించారు. అధిక రిస్క్‌గా పరిగణించబడే పథకాలలో పెట్టుబడిదారుల నుంచి కేవైసీ పత్రాలు, ఆదాయ రుజువు పత్రాలను పొందాలని సూచించబడింది ..

ఉదాహరణకు ఒక వ్యక్తి పొదుపు పథకంలో రూ. 50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకపోతే అతను తక్కువ రిస్క్ కేటగిరీలో చేర్చబడతాడు. పెట్టుబడి మొత్తం రూ. 50,000 కంటే ఎక్కువ అయితే , రూ. 10 లక్షలలోపు ఉంటే, అలాంటి పెట్టుబడిదారులు మీడియం రిస్క్ కేటగిరీలో ఉంటారు. ఇంకా పెట్టుబడి మొత్తం రూ.10,000 పరిమితిని దాటితే, ఆ వ్యక్తులను హై రిస్క్ కేటగిరీగా పరిగణిస్తారు..

ఇకపోతే సేవింగ్ స్కీమ్‌ను ఉపయోగించే ఏదైనా..

ఫోటో, ఐడి ప్రూఫ్, పాన్ నంబర్‌ను పొందాలని పోస్టాఫీసులకు కేంద్రం సూచించింది. రూ .10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారు తమ డబ్బు మూలానికి సంబంధించిన పత్రాన్ని అందించాలి.. ఇంకా వివరాలిలా..

బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా స్టేట్‌మెంట్.. గత 3 ఏళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఒక సంవత్సరం రికార్డు. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వీలునామా, వారసత్వం మొదలైన పత్రాలు..డబ్బు మీవే అనడానికి సరైన ఆధారాలను చూపించే సరైన పత్రాలను అందించాలి.. ఇవి ఏ ఒక్కటి లేకుంటే మాత్రం రిస్క్ లో పడ్డట్లే..

Read more RELATED
Recommended to you

Exit mobile version