హైదరాబాద్ టు తిరుమల.. ఎంచక్కా ఫ్లైట్ లో ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!

-

మీరు ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే పక్కా మీరు ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. సమ్మర్ హాలిడేస్‌లో చక్కగా తిరుమల వెళ్లి వచ్చేయచ్చు. ఈ టూర్ లో భాగంగా తిరుచానూర్, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలు కవర్ అవుతాయి. పైగా అందుబాటు ధరలోనే మీరు తిరుమల టూర్ ప్లాన్ చేయొచ్చు. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అంట్ టూరిజం ఒక సూపర్ ప్యాకేజీ ని అందుబాటు లోకి తెచ్చింది.

ఈ టూర్ ప్యాకేజీ పేరు వచ్చేసి తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్. ఈ టూర్ ప్యాకేజీ ని బుక్ చేసుకుంటే హ్యాపీగా ఈ ప్రదేశాలని చూసి రావచ్చు. ఫ్లైట్‌లో వెళ్లి వచ్చేయచ్చు. ఈ టూర్ రెండు రోజులు ఉంటుంది. తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల చూడవచ్చు. జూన్ 1, 8, 15, 20, 22, 27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో వుంది. జూలై నెలలో 4, 6, 20, 25 తేదీల్లో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. టూర్ ధర రూ. 14645 నుంచి మొదలు అవుతోంది.

డబుల్ ఆక్యుపెన్సీలో ఒక వ్యక్తిగా ఈ రేటు. సింగిల్ ఆక్యుపెన్సీ లో చూస్తే రూ. 16,330 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో అయితే ఒక్కొక్కరికి రూ. 14,550 పడుతుంది. ఇలా వేర్వేరు ధరలు వున్నాయి. అధికారిక వెబ్ సైట్ లో ఈ వివరాలు చూడచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఫ్లైట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్యాకేజీ లో భాగమే. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపూరంలో దర్శనం ఇవన్నీ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version