కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప వారణాసికి జాగ్రత్తలు చెప్తుంది. అక్కడికి వెళ్లాక ఫోన్ చేస్తాను అంటుంది. వారణాసి వెళ్లిపోతాడు. ఇంకోవైపు కార్తీక్ కారులో వస్తూ ఉంటాడు. ఎక్కడమొదలైంది నా జీవితం ఎక్కడికి వెళ్తుంది అనుకుని గతాన్ని తలుచుకుంటాడు. అంతాబాగుంది అనుకుంటుంటే మోనిత రూపంలో ఏదో ప్రళయం ముంచుకొచ్చింది అనుకుని బాధపడతాడు. తప్పనిపరిస్థితుల్లో తప్పుచేయకున్న అమెరికావెళ్లక తప్పటంలేదు..అమెరికాలో కొత్తజీవితం మొదలుపెట్టాలి. అమెరికాలో నేను ఏ స్టేట్ లో ఉన్నానో ఎవరికి చెప్పకూడదు అనుకుంటాడు. ఇంట్లో పేపర్లో మోనిత విడుదల అవుతుందని వేస్తారు. అది చూసి అందరూ నిర్గాంతపోయినుల్చుంటారు. సౌందర్య ఆ పేపర్ తీసుకుని చదువుతుంది. దీప ఏంటి అత్తయ్య ఇది అలా ఎలా బయటకొచ్చింది. ఆ వచ్చేదేదో మేమం అమెరికాలో దిగాక వస్తేబాగుండేది కదా, సరిగ్గా ఈరోజే బయటకురావాలా అంటుంది. సౌందర్య ఎందుకే టెన్షన్ పడుతున్నావ్, అది వచ్చి మిమ్మల్ని ఆపేస్తుందా అంటుంది సౌందర్య. అందరూ దీపకు ధైర్యం చెప్తారు.
నా దరిద్రం కాకపోతే అది ఈరోజే భయటకురావాలా అని అంటుంది. సౌందర్య దీప నువ్వఅలా భయంగా భేలగా చూడకే..కొన్ని గంటలు మాత్రమే ధైర్యంగా ఉండు అంటుంది. దీప మాత్రం మనసులో గుబులుగా ఉంది అత్తయ్య, ఏదో అపశకునం కాకపోతే ఏంటి ఇది అంటుంది దీప. శ్రావ్య..ఈ పేపర్ పిల్లలు చూస్తున్నారని భయపడుతున్నావా అక్కా..దీన్ని దాచేద్దాం అంటుంది. దీప గతంలో పేపర్ విషయంలో శౌర్య అన్న మాటలను తలుచుకుని పిల్లలను కిందకు పిలుస్తుంది. సౌందర్య ఇప్పుడు వాళ్లనెందుకు పిలుస్తున్నావే అంటుంది. పిల్లలు కిందకు వస్తారు. వాళ్లకి దీప ఆ పేపర్ ఇస్తుంది. సౌందర్య లాక్కుని ఏ దీప ఏం చేస్తున్నావే అంటుంది. దీప మళ్లీ వాళ్ల చేతికి ఇచ్చి ఇందులో మోనిత ఆన్టీ విడుదలై జైలునుంచి వచ్చినట్లుగా రాశారు, వింటున్నారా మీకే చెప్పేది, ఆవిడగారు జైలునుంచి బయటకువచ్చారంట అంటుంది. అందరూ టెన్షన్ పడుతారు. కానీ ఆదిత్యమాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. శౌర్య సరే అమ్మా ఈ విషయం మాకెందుకు చెప్తున్నారు. తనొస్తే మాకేంటి, రాకపోతేమాకేంటి అంటుంది. మా దగ్గరు అన్నీ దాస్తున్నారు అంటున్నారుగా, దాపరికాలు లేకుండా పిలిచిమరి చెప్తున్నాను అంటుంది. సరే అని పేపర్ అక్కడే పెట్టేసివెళ్తుంది శౌర్య. కానీ హిమ మాత్రం ఆ పేపర్ తీసుకుని వెళ్తుంది.
ఇంకోసీన్ లో కార్తీక్ ఎవరో రవి అంట వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ పోలీసులు ఉంటారు. పోలీసులు ఎందుకు ఉన్నారు..ఎవరో పేషంట్ తాలుకూ వచ్చిఉంటారు అనుకుని లోపలికి వెళ్తాడు..పనిఅతను బయటకుర్చోపెట్టి సార్ కి చెప్తాను మీరు ఇక్కడ ఉండండి అంటాడు. లోపల రవి అంటే భారతి భర్త. భారతిని ఎందుకు ఇదంతా అంటూ మ్యాటర్ అర్థంకాకుండా తిట్టుకుంటారు.వెళ్లు వెళ్లి ఏంకావోలో చూడు అంటాడు. మోనితను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది భారతి. మోనికు కడుపు పెద్దగా అవుతుంది. భారతి కాఫీతెచ్చిఇస్తుంది. ఏంటలా భయంగా చూస్తున్నావ్ భారతి అని ఇన్నాళ్లు నువ్వునాకు చాలా సహాయం చేశావ్ కాదనను..ఇక చాల్లే ఆపేద్దాం అనుకుంటున్నావ్ కదా, నీ హెల్ప్ నాకు కావాలి భారతి అంటుంది మోనిత. ఇన్నాళ్లు హెల్ప్ చేసి ఇప్పుడు ఇలాంటప్పుడు నా ఫ్రెండ్ షిప్ కట్ చేద్దాం అనుకుంటున్నావ్ కదా అంటుంది.ఇలా ఏదో ఒకటి మాట్లాడి..కార్తీక్ హాస్పటల్ కి వెళ్దామన్నావ్ కదా, వెళ్దామా అంటుంది. భారతికి మనసులో ఈ దరిద్రం నాకెందుకు అనుకున్నా..బయటకిమాత్రం అలా ఏంలేదు మోనిత అంటుంది. ఇలా మోనిత ఏదోఒకటి చెప్పి లాగ్ చేసి కోపంతో చేతిలో ఉన్న కాఫీ కప్పువిసిరేస్తుంది.
కింద ఉన్న కార్తీక్..ఏంటా ఆ సౌండ్..వాళ్లిద్దరు ఏదైనా విషయంలో గొడపపడుతున్నారా..నేను ఇక్కడికి రావటం కరెక్టేనా..తర్వాత ఫోనులో మాట్లాడదాం అనుకుని వెళ్లిపోబోతాడు..అప్పుడే టీపాయ్ మీద ఉన్న పేపర్ లో మోనిత విడుదలైంది చూస్తాడు. మనోడు మోనిత విడులదలైందా..నాకు ఇంకా ఫోన్ చేయలేదేంటి..ఒకవేళ ఇంటికెళ్లిందా అనుకుని భయపడతాడు..నేనెందుకు భయపడుతున్నాను. నేనేతప్పు చేయలేదు, తనేచేసింది, రానీ నాకేంటి భయం, ఎదుర్కొంటాను, అనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడే పనోడువచ్చి భారతి మోడమ్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అంటాడు. కార్తీక్ పదా అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
– Triveni Buskarowthu