రిటైర్ అయ్యిన వారు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే వీటిని గుర్తుంచుకోండి..!

-

మీరు రిటైర్ అయ్యిపోయారా..?, హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇక వాటి కోసం చూసేస్తే.. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రిటైర్ అయిన వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. అయితే రిటైరైన వారు రుణం పొందాలంటే ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

రుణ కాలపరిమితి తక్కువ ఉండాలి అని మొదట గుర్తు పెట్టుకోండి. బ్యాంకులు కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ బ్యాంకేతర ఆర్థిక సంస్థలు లోన్ అర్హతను నిర్ణయించడానికి గతంలో తీసుకున్న రుణాల గురించి క్రాస్ చెక్ చేసి ధ్రువీకరిస్తాయి. కనుక 70 ఏళ్లకు మించకుండా రుణం తీసుకుంటే మంచిది.

అదే విధంగా ఇన్సూరెన్స్ అందించడం కూడా ముఖ్యం.రుణాలు ఇచ్చే సంస్థలు హోంలోన్ తో పాటు గృహ రుణ బీమా పథకాన్ని తీసుకోవడం మంచిది. అయితే హోంలోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. కానీ రిటైర్డ్ వ్యక్తులు లోన్ కోరుతున్న ప్రాపర్టీని భద్రంగా ఉంచాలంటే దీన్ని ఎంచుకోవాలి.

అలానే ఎలాంటి రక్షణ లేకుండా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తాయి. అందు వల్ల పదవీ విరమణ చేసినవారు సురక్షితమైన రుణాన్ని ఎంచుకోవాలి. అదే విధంగా రుణమిచ్చే సంస్థలు లోన్-టూ-లోన్ (LTV) విధానంలో కౌంట్ చేస్తారు కనుక రిటైర్డ్ వ్యక్తులు లోన్ అమౌంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

అలానే రుణ మొత్తం తక్కువగా ఉండటం వల్ల రుణ దాతకు ఈఎంఐల క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ కనుక ఈఎంఐ అవుట్ గో గురించి మీకు తెలియకపోతే ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే ఈఎంఐ క్యాలిక్యులేటర్ ని ఉపయోగించి క్యాష్ ఫ్లో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version