అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 : ఆ వస్తువులపై బంపర్ ఆఫర్స్.. త్వరపడండి!

-

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు అయితే మంచి ఆఫర్ ఉంది. వారు 12 గంటల ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.అమెజాన్ షాపింగ్ చేసే వారి కోసం ఆగస్టు 6న స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక తగ్గింపు సేల్ స్టార్ట్ అయింది.

ఇక ఈ అమెజాన్ సేల్ అన్ని ప్రొడక్టు కేటగిరీలలో వేలకొద్దీ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా తగ్గింపులను కూడా అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులు వారి బడ్జెట్‌కు సరిపోయే ప్రైమరీ లేదా హై-పర్ఫార్మెన్స్ టీవీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సోనీ , షావోమీ, ఎల్‌జీ, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలు ఈ ఏడాదిలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా 65 శాతం దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

సోనీ బ్రావియా 43-అంగుళాల 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీ ప్రస్తుతం రూ. 38,990కు పొందవచ్చు. ఈ టీవీల ఒరిజినల్ ధరల విషయానికి వస్తే రూ. 59,900కు ఉన్నాయి. 43 అంగుళాల స్క్రీన్ కలిగిన ఎంఐ ఎక్స్ సిరీస్ టీవీని రూ. 42,999కి బదులుగా రూ. 24,999కు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్ ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి పేమెంట్లను చేసే కస్టమర్‌లు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ని కూడా పొందవచ్చు. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఈఎంఐ ఆప్షన్లు ఇంకా కూపన్ తగ్గింపులపై మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. అమెజాన్ పే యూపీఐ లావాదేవీలతో కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. రూ. 50వేల లోపు స్మార్ట్ టీవీలపై అయితే కచ్చితంగా సూపర్ డీల్స్ ని మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version