ప్రజలు మార్పు కొరుకుంటే గెలవటం చాలా సులభం అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని స్థానిక పంక్షన్ హాల్ లో పదవీకాలం ముగిసిన zptc, mpp, mptc లకు సన్మానం చేసారు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు నిజాయితీ పని చేశారు కానీ ఓటర్లు మార్పు కొరుకున్నారు.మన ఓడినందుకు భాద పడాల్సిన అవసరం లేదు. వెలుగు కు చీకటి అవసరం అలానే మనకు చీకటి వచ్చింది అంతే పదవులు అనేవి శాశ్వతం కాదు. 1% ఓట్ల తేడాతోనే మనం రాష్ట్రం లో ఓడిపోయ్యాం అంతే కానీ బీఆర్ఎస్ వీలినం చేస్తున్నం అని కొంతమంది నాయకులు అంటున్నారు దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రజలు ఎప్పుడూ అధికారం చూడరు..మంచితనం కూడా చూస్తారు. పని చేసిన వాటికి బిల్లులు అపకుడదు అలాంటి ఇప్పుడు బిల్లులు కావటం లేదు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఓపిక నిజాయితీ తో ఉంటే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెళ్ళిళ్ళు కాలేదా..? ఇస్తా అన్న తులం బంగారం ఏమైంది.? ప్రజలు ఇవన్ని గమనిస్తున్నారు. ఫ్రీ బస్సు తప్ప ఇంకేమైనా పధకాలు అమలు అయ్యాయా..? ప్రజలు మార్పు కొరుకుంటే గెలవటం సులభం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరుగురు ఎమ్మెల్యే లుగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాలేదా.. ఓడిపోయ్యాం అని ఎవ్వరు అదైర్య పడొద్దు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండండి. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి అని సూచించారు.